క్రీడాభూమి

చాలా ఆడేశాను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: హాకీ యోధుడు ఆటకు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఆసియా గేమ్స్‌కు వెళ్తూ.. వచ్చే ఒలింపిక్‌లోనూ ఆడాలనుందని మనసులో మాట చెప్పిన ఆటగాడు, ముందే రిటైర్మెంట్‌కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. భారత హాకీని సమర్థంగా నడిపించడమే కాదు, హాకీకి ఓ నిర్వచనం ఇచ్చిన ఆ ఆటగాడే -సర్కార్ సింగ్. పనె్నండేళ్ల పాటు హాకీయే జీవితంగా బతికిన తాను, ఇక కొత్త జీవితాన్ని చూడాలని అనుకుంటున్నట్టు బుధవారం మనసులో మాట బయటపెట్టాడు. పనె్నండేళ్లపాటు చాలా హాకీ ఆడేశానని, ఇక ఆడటానికి యువకులు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించాడు.
ఆసియా గేమ్స్‌కు వెళ్లేముందు ఒలింపిక్ ఆశను ప్రకటించిన సర్దార్, తిరుగులేని భారత జట్టు కాంస్యానికి పరిమితం కావడంతో తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. అప్పటినుంచీ హాకీ స్నేహితులు, కుటుంబీకులు, మిత్రులతో భవిష్యత్‌పై తీవ్ర సమాలోచనలు జరిపిన సర్దార్ చివరకు రిటైర్మెంట్‌కే నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే శుక్రవారం ఢిల్లీలో అధికారికంగా తన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ‘ఔను, అంతర్జాతీయ హాకీనుంచి రిటైర్ కావలన్న నిర్ణయానికి వచ్చాను. కెరీర్‌లో చాలా హాకీ ఆడాను. పనె్నండేళ్లంటే సుదీర్ఘ కాలమే. ఇక నా బాధ్యత పూరె్తైందనిపిస్తోంది. భారత హాకీని బలోపేతం చేయగల సమర్థ యువత ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని సర్దార్ వెల్లడించాడు. ‘ఈ నిర్ణయానికి ముందు చండీగఢ్‌లోని కుటుంబీకులు, భారత హాకీ స్నేహితులు, మిత్రులతో తీవ్రంగానే చర్చించాను’ అని చెప్పుకొచ్చాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఆసియా గేమ్స్‌లో కాంస్యంతో వెనక్కి వచ్చిన దగ్గర్నుంచీ సర్దార్ తీవ్ర అసంతృప్తికి గురవ్వడం తెలిసిందే. టోక్యో 2020 ఒలింపిక్‌లో ఆడాలన్నదే చివరి కోరిక అంటూ చాలాకాలంగా చెబుతోన్న సర్దార్, ఆ టైం రాకముందే అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ‘నా నిర్ణయానికి ఫిట్‌నెస్ కారణం కాదు. ఇంకా చాలా యేళ్లు ఆడగల సత్తా నా దగ్గరుంది. కానీ, చాలాకాలం హాకీయే జీవితంగా బతికా. హాకీయేతర జీవితానికి సమయం వెచ్చించాల్సిన తరుణం వచ్చిందని అనిపిస్తోంది. అందుకే గుడ్‌బై చెప్పదలచుకున్నా’ అంటూ వివరించాడు. వచ్చే శుక్రవారం న్యూఢిల్లీలో సర్కార్ సింగ్ అధికారికంగా తన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.