క్రీడాభూమి

చైనాలో నేటి నుంచి ఆసియా బాడ్మింటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహన్ (చైనా), ఏప్రిల్ 26: చైనాలోని ఉహన్‌లో బుధవారం నుంచి ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ‘తెలుగు తేజం’ పివి.సింధు సహా భారత్‌కు చెందిన పలువురు షట్లర్లు టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు అర్హత పోటీల గడువు ముగియడానికి ముందు జరుగుతున్న చివరి ఈవెంట్ ఇదే. ఇటీవల సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ అంతకుముందు మడమ గాయం నుంచి కోలుకుని స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్ టోర్నీల్లో సెమీఫైనల్స్ వరకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనా నెహ్వాల్ బుధవారం ఇండోనేషియా క్రీడాకారిణి ఫిత్రియానీ ఫిత్రియానీతో తన పోరాటాన్ని ఆరంభించనుంది. అయితే స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, చైనా మాస్టర్స్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్క్రమించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 10వ స్థానంలో కొనసాగుతున్న పివి.సింధు ఈ టోర్నీలో మరింత మెరుగ్గా రాణించాలని పట్టుదలతో ఉంది. ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆమె మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేషియా)తో తలపడనుంది. అలాగే పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం), పురుషుల డబుల్స్ విభాగంలో మను అత్రి-బి.సుమిత్ రెడ్డి, ప్రణవ్ జెర్రీ చోప్రా-అక్షయ్ దేవాల్కర్, మహిళల డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్త-అశ్వనీ పొన్నప్ప కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.