క్రీడాభూమి

పసిడి పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలెండ్‌లోని గ్లివైస్‌లో జరుగుతోన్న 13వ సిసీలియన్ ఓపెన్ బాక్సింగ్ మహిళా టోర్నీలో భారత బాక్సర్ మేరీ కోమ్ (48కేజీ) స్వర్ణాన్ని సాధించింది. మరో బాక్సర్ మనీషా (54 కేజీ) రజత పతకాన్ని ఒడిసిపట్టి భారత మహిళా బాక్సర్ల సత్తా ప్రదర్శించింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన మేరీ కోమ్ వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా మ్యాచ్‌లకు దూరంగా ఉంటుండటం తెలిసిందే. ఆసియా గేమ్స్‌కూ హాజరుకాని మేరీకోమ్, తాజా టోర్నీలో కజకిస్తాన్ బాక్సర్ అయిగిరిమ్ కాస్సానయెవాను 5-0 స్కోరుతో మట్టి కరిపించి స్వర్ణాన్ని అందుకుంది. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి వ్యూహాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో మేరీ నైపుణ్యం కనిపించింది. ‘ముందస్తు ప్రణాళికను అమలు చేయడంలో మేరీకి మరెవరూ సాటిరారు. ఆమె బౌట్‌లోకి దిగాక ఊహకందని నైపుణ్యాన్ని ప్రదర్శించింది’ అని భారత కోచ్ రాఫెల్లె బెర్గమాస్కో వ్యాఖ్యానించాడు. మరో ఫైనల్ మ్యాచ్‌లో ఉక్రెయిన్ బాక్సర్ కృపెనియాతో తలపడిన మనీషా (54) 2-3 స్కోరుతో ఓటమి చవిచూసి రజతానికి పరిమితమైంది. సీనియర్ల విభాగంలో భారత బాక్సర్లు నాలుగు కాంస్య పతకాలు (ఎల్ సరితా దేశి (60కేజీ), రిత్ గ్రెవాల్ (51 కేజీ), లవ్‌లిన బర్గెహెయిన్ (69), పూజా రాణి (81 కేజీ) సాధించారు. ఇక జూనియర్ల విభాగంలో మాజీ ప్రపంచ చాంపియన్ జ్యోతి గులియా (51కేజీ) స్వర్ణాన్ని సాధించి వచ్చె నెల అర్జెంటీనాలో మొదలుకానున్న యూత్ ఒలింపిక్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించింది. టోర్నీలో చెలరేగిన కుర్ర బాక్సర్లు ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఒక కాంస్యంతో పతకాల పంట పండించారు.
టర్కీ టోర్నీలో మూడు స్వర్ణాలు
ఇస్తాంబుల్‌లో జరుగుతున్న అహ్మెట్ కోమెర్ట్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు చెలరేగారు. సిమ్రన్జిత్ కౌర్ (64 కేజీ), మోనిక (48కేజీ), భాగ్యబతి కచరి (81 కేజీ)లు తమతమ విభాగాల్లో ప్రత్యర్థులను మట్టిగరిపించి మూడు స్వర్ణాలు సాధించారు. టర్కీ బాక్సర్ సెమ కలిస్కన్‌పై సిమ్రన్జిత్ సునాయాస విజయం సాధిస్తే, మరో టర్కీ బాక్సర్ ఐసె కగిరెర్‌పై మోనిక విజయం సాధించింది. మరో టర్కీ బాక్సర్ సెల్మా కరన్‌కోయున్‌ను భాగబతి ఓడించి స్వర్ణాన్ని దక్కించుకుంది. భారత భాక్సర్లు పింకీ జాంగ్రా, సోనియా లెథర్ (57 కేజీ విభాగం)లు కాంస్యాలకు పరిమితమయ్యారు. టోర్నమెంట్‌లో భాగ్యబతిని అత్యంత శాస్ర్తియ బాక్సర్‌గా ప్రకటించారు. టోర్నీ పతకాల పట్టికలో భారత జట్టు మూడోస్థానంలో నిలిచింది.