క్రీడాభూమి

మరింత పదునుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 17: హాంకాంగ్‌పై అప్రతిహత విజయంతో ఆసియా కప్‌లో శుభారంభాన్ని పలికిన పాక్, భారత్‌ను ఎదుర్కోవాలంటే మరింత సమర్థంగా ముందుకెళ్లాల్సి ఉందని స్కిప్పర్ సర్పరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌కే స్పెషల్ అట్రాక్షన్ అయిన భారత్- పాక్‌ల పోరు బుధవారం జరగనుంది. టోర్నీపై పట్టుపెంచేందుకు ఇరు జట్లూ సన్నద్ధమవుతున్నాయి. హాంకాంగ్‌పై గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పరాజ్, భారత్‌ను ఎదురొడ్డడానికి పాక్ జట్టు కొంత దూకుడు పెంచాలన్నాడు. ‘అనేక అంశాల్లో మేం మెరుగవ్వాల్సిన పరిస్థితిని జట్టు సారథిగా గుర్తించాను. నిజానికి ఆ వైఫల్యాలను అధిగమిస్తే తొమ్మిది లేక పది వికెట్ల తేడాతో విజయం సాధించగలం’ అన్నాడు. కొత్త బంతితో బౌలింగ్‌లో మెరుగుదల చూపించాల్సి ఉందని, మరింత వేగంగా వికెట్లు తీయాల్సి ఉందన్నాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో బంతి స్వింగ్ కాకపోవడాన్ని గుర్తించామని, అది జట్టుకు ఒక హెచ్చరిక లాంటిదన్నాడు. మరింత స్వింగ్ రాబట్టడాన్ని వచ్చే ప్రాక్టీస్ సెషన్‌లో సాధన చేయాల్సి ఉందని సర్పరాజ్ పేర్కొన్నాడు.