క్రీడాభూమి

మిడిలార్డర్ సెట్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 17: టీమిండియా మిడిలార్డర్‌ను బలోపేతం చేయగల బ్యాట్స్‌మెన్లను గుర్తించడమే ఆసియా కప్ పరమార్థమని స్కిప్పర్ రోహిత్ శర్మ అన్నాడు. 4, 6 స్థానాల్లో రాణించగల బ్యాట్స్‌మెన్లను గుర్తించడంపై దృష్టిపెట్టామన్నాడు. హాంకాంగ్‌తో మంగళవారం ఆడాల్సిన తొలి మ్యాచ్‌తో ఆసియా కప్‌లోకి అడుగుపెడుతున్న టీమిండియా, మరుసటి రోజే దాయాది దేశమైన పాక్‌తో తలపడనుంది. ఏడాదిగా టీమిండియాను పట్టిపీడిస్తున్న సమస్య బలహీన మిడిలార్డర్. ఇటీవలి ఇంగ్లాండ్ ఓడీఐ సిరీస్‌లోనూ టీమిండియా వైఫల్యానికి కారణమిదే. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కీలకమైన మిడిలార్డర్ స్లాట్స్ కోసం ప్రస్తుతం మనీష్ పాండే, కేదార్ జాదవ్, అంబటి రాయుడు పోటీపడుతున్నట్టు చెప్పాడు. ‘బ్యాటింగ్ ఆర్డర్‌లోని 3, 4, 6 స్థానాల కోసం జట్టులో (కేదార్, మనీష్, రాయుడు) చాలామందే పోటీ పడుతున్నారు. ఈ సిరీస్‌లో ఆయా స్థానాల్లో నిలదొక్కుకునే బ్యాట్స్‌మెన్లను గుర్తించి అవకాశాలు ఇవ్వడం ద్వారా మిడిలార్డర్‌ను బలోపేతం చేసే ఆలోచన ఉంది. ముఖ్యంగా 4, 6 స్థానాల్లో కుదురుకోగలిగే బ్యాట్స్‌మెన్లను ఎంపిక చేయాల్సి ఉంది’ అని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ అందించిన సంకేతాల ప్రకారం జట్టులో మహేంద్ర సింగ్ ధోనీకి ఐదోస్థానం కల్పించనున్నారు. యోయో టెస్ట్‌ను అధిగమించి అంబటి రాయుడు, హాస్ట్రింగ్ సర్జరీ తరువాత కేదార్ జాదవ్ జట్టులో అవకాశం దక్కించుకున్నారు. ‘ఇద్దరూ ముఖ్యమైన ఆటగాళ్లే. నిజానికి ఇద్దరూ ఇంగ్లీష్ సిరీస్‌లో ఉండాల్సినోళ్లే. పరిస్థితుల కారణంగ దూరమయ్యారు. ఇప్పుడు జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. జట్టు విజయాల్లో ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తారనే భావిస్తున్నా’ అని రోహిత్ పేర్కొన్నాడు. బౌలర్లను రొటేట్ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు ‘దానిగురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. భిన్న పరిస్థితులకు ఒక్కొక్కరూ ఎలా ప్రతిస్పందిస్తున్నారో చూడాల్సి ఉంది. అదే సమయంలో స్థిరంగా కొనసాగుతున్నవారికి ఎక్కువ అవకాశం ఇవ్వాలన్న ఆలోచనా ఉంది. ఆ రెండు అంశాల సంయమన ప్రాతిపదికనే నిర్ణయాలు ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించాడు. హాంకాంగ్ జట్టుపై గెలుపు అవకాశాలపై ప్రశ్నించినపుడు ‘ప్రత్యర్థి ఎవ్వరైనా సమనంగానే పరిగణిస్తాం. సమిష్టిగా జట్టు ఏం చేయగలదు? అన్న అంశంపైనే దృష్టిపెట్టాం. వాతావరణ పరిస్థితులూ అనుకూలిస్తాయో లేదో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో గేమ్‌పై దృష్టిపెట్టడమే మనం చేయగలిగేది’ అని వ్యాఖ్యానించాడు.

చిత్రం.. స్కిప్పర్ రోహిత్ శర్మ