క్రీడాభూమి
ఫైనల్‌కు భారత రెజ్లర్ సాజన్ భన్వాల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 September 2018
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భారత రెజ్లర్ సాజన్ భన్వాల్ స్లవేకియాలోని ట్రన్వాలో జరుగుతున్న గ్రీక్-రోమన్ 77 కేజీల జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో నార్వేకు రెజ్లర్ పెర్ ఆండెర్స్ క్యూర్‌ను ఓడించాడు. ఫైనల్‌లో రష్యా రెజ్లర్ ఇస్లామ్ ఒపీవ్‌తో జరిగే పోరులో సాజన్ తలపడతాడు. ఈ పోరులో అతనికి కనీసం రజత పతకం తప్పకుండా దక్కే అవకాశం ఉంది. హర్యానాకు సాజన్ ఈ ఏడాది జూలైలో జరిగిన జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో ఉక్రెయిన్ రెజ్లర్ డిమిట్రో గార్డుబీని ఓడించాడు. 2017లో ఫిన్లాండ్‌లోని తాంపెరెలో జరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు.