క్రీడాభూమి

ఆస్ట్రేలియా క్రికెట్‌లోకి మళ్లీ స్టీవ్ స్మిత్ రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, సెప్టెంబర్ 18: ఆస్ట్రేలియా క్రికెట్‌లోకి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రాక ఎంతో అవసరమని, ఆయన మళ్లీ వెనుకకు వస్తే ఘనంగా స్వాగతిస్తామని మాజీ కెప్టెన్ స్టీవ్ వా అన్నాడు. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపంరింగ్‌కు పాల్పడడంతో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, మరో ఆటగాడు డేవిడ్ వార్నర్ ఏడాదిపాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐసీసీ సస్పెన్షన్ విధించింది. అదేవిధంగా ఇదే జట్టులోని ఓపెనర్ కామరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల స్టీవ్ స్మిత్ ఇప్పటివరకు 64 టెస్టు మ్యాచ్‌లు ఆడాడని, రాత్రికి రాత్రే అలాంటి దిగ్గజ ఆటగాడిని ఆ స్థానంలో భర్తీ చేయలేమని అన్నాడు. నిషేధం ఎదుర్కొన్న ఆ ముగ్గురు ఆటగాళ్లు తాము చేసిన తప్పులను ఒప్పుకున్నందున అభిమానులు, ప్రజలు కూడా వారిని క్షమించాలని, ఇప్పటికే ఎంతో నష్టపోయారని అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు స్టీవ్ స్మిత్‌సహా మిగిలిన ఇద్దరు ఆటగాళ్లను జట్టులోకి మళ్లీ తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డాడు.