క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్జ్‌హౌ: ఒలింపిక్ వరల్డ్ చాంపియన్, రజత పతక విజేత పీవీ సింధు మంగళవారం ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్‌లో ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. ప్రపంచ మూడో సీడ్ క్రీడాకారిణి అయిన సింధు 2016లో చైనా ఓపెన్ టోర్నీలో టైటిల్ అందుకుంది. మంగళవారం ఇక్కడి ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ జింగ్‌చెంగ్ జిమ్మాజియంలో జరిగిన ఓపెనింగ్ రౌండ్‌లో వరల్డ్ నెంబర్ 39, జపాన్‌కు చెందిన సయేనా కవాకమీని 21-15, 21-13తో సింధు ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. కామనె్వల్త్ గేమ్స్‌లో రెండుసార్లు గోల్డ్ మెడల్స్ అందుకున్న సైనా నెహ్వాల్ 2014లో తొలిసారిగా చైనా ఓపెన్ టోర్నమెంట్ టైటిల్‌ను అందుకున్న తొలి భారత మహిళా షట్లర్‌గా ఘనత వహించింది. ఇక పురుషుల డబుల్స్‌లో భారత జంట మను అత్రి, బి.సుమీత్ రెడ్డి తమ ప్రత్యర్థి జంట చైనీస్ తైపీకి చెందిన జాతీయ చాంపియన్లు లియావో మిన్ చున్, సు చింగ్ హెంగ్‌లను 13-21, 21-13, 21-12తో ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.