క్రీడాభూమి

తొలి మ్యాచ్‌లో గెలిచి ఓడారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 19: ‘పసికూన’ హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌ని గెలిచినప్పటికీ, అభిమానులను ఆకట్టుకోవడంలో టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఓడారు. హాంకాంగ్ మరికొంత నిలకడగా ఆడివుంటే, భారత్ పరిస్థితి మరో విధంగా ఉండేది. నిజానికి అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో భారత్ ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. శిఖర్ ధావన్ (120 బంతుల్లో 127 పరుగులు) సెంచరీ సాధించగా, అంబటి రాయుడు (60) అర్ధ శతకంతో రాణించాడు. అయితే, బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న భారత్ భారీగా పరుగులు చేయడంలో విఫలమైంది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 285 పరుగులు సాధించగలిగింది. హాంకాంగ్‌కు అది భారీ లక్ష్యమేగానీ, అలాంటి అనామక జట్టుపై భారత్‌కు ఆ స్కోరు ఏ మాత్రం గౌరవ ప్రదమైనది కాదన్నది వాస్తవం. బ్యాటింగ్‌లో అంతగా మెప్పించలేకపోయిన టీమిండియా బౌలింగ్‌లోనూ ఆశించి స్థాయిలో రాణించలేకపోయింది. హాంకాంగ్ 174 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిందంటే, భారత బౌలర్ల ఏ స్థాయిలో బంతులు వేశారో ఊహించుకోవచ్చు. కెప్టెన్ అంశుమాన్ రథ్ (73), నిజాకత్ ఖాన్ (92) భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, హాంకాంగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని రుజువు చేశారు. ఆ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు చేజార్చుకొని 259 పరుగులు చేయగలిగింది.