క్రీడాభూమి

భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటునాయగే, సెప్టెంబర్ 19: శ్రీలంక మహిళలతో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ క్రికెట్ సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకున్న భారత మహిళల జట్టు బుధవారం టీ-20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్‌ని 13 పరుగుల తేడాతో గెల్చుకొని, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. పూనమ్ యాదవ్ 26 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేశారు. అనంతరం శ్రీలంక 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్‌లో తానియా భాటియా (46), జెమిమా రోడ్రిగ్స్ (36) చొప్పున పరుగులు చేసి, గౌరవ ప్రదమైన స్కోరుకు సహకరించారు. లంక బౌలర్లలో ఉదేశిక ప్రబోధని 18 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. భారత్‌ను ఓడించేందుకు 169 పరుగులు సాధించాల్సి ఉండగా, ఇషానీ లొకసూరియాగే (45), యశోదా మేండిస్ (32) జట్టును ఆదుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మిగతా బ్యాట్స్‌విమెన్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోవడంతో, ఆ జట్టు 13 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.