క్రీడాభూమి

క్రీడాస్ఫూర్తితో ఆడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, సెప్టెంబర్ 20: పాకిస్తాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడతామని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లినప్పుడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన కారణంగా, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడగా, సూత్రధారి డేవిడ్ వార్నర్ సూచనలను శిరసావహించి, ఓ సీసా మూతతో బంతి ఆకారాన్ని మారుస్తూ కెమెరాకు చిక్కిన కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌ల నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెలివేసింది. ఈ ఏడాది మార్చిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆస్ట్రేలియా ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది. కాగా, సామర్థ్యంతోకాకుండా, అడ్డదారుల్లో విజయాలను సాధిస్తున్నదంటూ వచ్చిన విమర్శల నుంచి బయటపడేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే పాకిస్తాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో నాణ్యమైన ఆటతో రాణించి, మళ్లీ అభిమానులను సంపాదించుకోవలని ఆసీస్ తాపత్రయ పడుతున్నది. ఇదే అంశం పైన్ మాటల్లో స్పష్టమైంది. గతాన్ని గురించి ఆలోచించడం లేదని, రాబోయే సిరీస్‌లపైనే దృష్టి కేంద్రీకరించామని పైన్ చెప్పాడు. ఇంగ్లాండ్ ఆటగాడు మోయిన్ అలీ ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలపై పైన్ స్పందిస్తూ, సహేతుకంకాని విమర్శలను పట్టించుకోబోమని అన్నారు. 2015 యాషెస్ సిరీస్ జరిగే సమయంలో ఒక ఆస్ట్రేలియా క్రికెటర్ తనను ‘ఒసామా’ అంటూ బిన్ లాడెన్‌తో పోల్చాడని మోయిన్ అలీ ఇటీవల చేసిన ప్రకటన సంచలనం సృష్టించగా, అలాంటి సందర్భమేదీ తన దృష్టికి రాలేదని పైన్ స్పష్టం చేశాడు. వివాదాలకు దూరంగా ఉంటామని, పాకిస్తాన్‌తో టెస్టు, ఆతర్వాత జరిగే టీ-20 సిరీస్‌లపైనే దృష్టి కేంద్రీకరించినట్టు పైన్ స్పష్టం చేశాడు.