క్రీడాభూమి

జాదవ్ విజయ రహస్యం అదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 20: పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ గొప్పగా రాణించాడు. మూడు వికెట్లు పడగొట్టి, జట్టు విజయంలో తనవంతు భూమిక పోషించాడు. ఇంతకీ అతని విజయ రహస్యం ఏమిటంటే, నెట్స్‌లో బౌలింగ్ చేయకపోవడమేనట. అతనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా బౌలింగ్ చేయలేదని, ఫలితంగా, గాయం తిరగబెడుతుందేమోనన్న భయం లేకుండా పాక్‌పై బౌలింగ్ చేయగలిగానని పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. కండరాలు బెణకడంతో కొంతకాలం ఆటకు దూరమైన అతను ఈ మ్యాచ్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ అతనిని ఎవరూ ఊహించని ఆయుధంగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగించే అవకాశం లేకపోలేదు.