క్రీడాభూమి

ఖేల్ రత్నలు.. కోహ్లీ, చాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: క్రీడరంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్త్న్ర అవార్డును భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు కేంద్రం ప్రకటించింది. 2018 సంవత్సరానికిగాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఇద్దరికి రాజీవ్‌ఖేల్ రత్న, 20 మందికి అర్జున, నలుగురికి ధ్యాన్‌చంద్, ఎనిమిది మందికి ద్రోణాచార్య పురస్కారాలను ప్రకటించింది. అలాగే ఇంటర్-యూనివర్సిటీ టోర్నమెంట్లలో విశ్వవిద్యాలయాల్లో ఆగ్రగామిగా నిలిచిన అమృత్‌సర్‌లోని గురనానక్ దేవ్ యూనివర్సిటీకి వౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ లభించింది. అలాగే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెట్, జేఎస్‌డబ్య్లూ స్పోర్ట్స్, ఇషా జౌట్రిచ్‌లకు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 25న ఈ అవార్డులను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అందజేస్తారు. ఖేల్ రత్న గ్రహీతలకు రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలకు రూ.5 లక్షల చొప్పున నగదును అందజేస్తారు. ఈ అవార్డులను ప్రతి ఏడాది జాతీయ క్రీడా దీనోత్సవం ఆగస్టు 29నాడు అందజేస్తారు. కానీ, ఈ ఏడాది అసియా క్రీడాలు జరిగినందున అవార్డుల ప్రకటన వాయిదాపడింది. ఖేల్ రత్న అవార్డును 1984 నుంచి 1989
మధ్యకాలంలో భారత ప్రధానిగా వ్యవహరించిన రాజీవ్ గాంధీ పేరుమీద నెలకొల్పారు. కనీసం నాలుగేళ్లు దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. అదే విధంగా ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దే గురువులకు ద్రోణాచార్య అవార్డును అందిస్తారు. ఈసారి ఈ అవార్డు ఎనిమిది మందికి లభించింది. తమతమ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన వారికి అర్జున అవార్డును ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. క్రీడల్లో ఈ ఏడాది 20 మందికి అర్జున అవార్డు లభించింది.
ఇలావుంటే, క్రీడా అవార్డుల కోసం లెక్కకుమించిన ప్రతిపాదనలు రావడంతో, ఎంపిక బాధ్యతను పలువురు మాజీ ఒలింపియన్లు, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు, సీనియర్ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్‌తో కూడిన కమిటీకి అప్పగించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని విశే్లషించిన తర్వాత అవార్డుకు కోహ్లీ, చాను పేర్లను కమిటీ కరారు చేసింది. ఈ కమిటీకి న్యాయమూర్తి ఇందర్‌మీత్ కౌర్ కొచ్చర్ చీఫ్‌గా వ్యవహరించారు. అదే విధంగా రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ కమిటీ చీఫ్‌గా క్రీడా మంత్రిత్వశాఖ కార్యదర్శి రాహుల్ భట్నాగర్ ఉన్నారు. వౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ కమిటీకి మాజీ ఒలింపియన్, హాకీ క్రీడాకారుడు అశోక్ కుమార్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
రాజీవ్ ఖేల్ రత్న: 1. విరాట్ కోహ్లీ (క్రికెట్), 2. మీరాబాయ్ చాను (వెయిట్‌లిఫ్టింగ్).
అర్జున అవార్డు: 1. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), 2. జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), 3. హిమా దాస్ (అథ్లెటిక్స్), 4. నీలకుర్తి సిక్కీరెడ్డి (బాడ్మింటన్), 5. సతీష్ కుమార్ (బాక్సింగ్), 6. స్మృతి మందానా (క్రికెట్), 7. సుభాంకర్ శర్మ (గోల్ఫ్), 8. మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), 9. సవిత (హాకీ), 10. కల్నల్ రవి రాథోడ్ (పోలో), 11. రాహి సర్నోబట్ (షూటింగ్), 12. అంకుర్ మిట్టల్ (షూటింగ్), 13. శ్రేయాస్ సింగ్ (షూటింగ్), 14. మానికా బాత్రా (టేబుల్ టెన్నిస్), 15. జీ. సథియన్ (టేబుల్ టెన్నిస్), 16. రోహన్ బొపన్న (టెన్నిస్), 17. సుమీత్ (రెజ్లింగ్), 18. పూజా కడియన్ (ఉషు), 19. అంకుర్ ధమా (పారా అథ్లెటిక్స్), 20. మనోజ్ సర్కార్ (పారా బాడ్మింటన్).
ధ్యాన్ చంద్ అవార్డు: 1. సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), 2. భరత్ కుమార్ ఛెత్రి (హాకీ), 3. బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), 4. చౌగలే దడూ దత్తాత్రేయ (రెజ్లింగ్).
ద్రోణాచార్య అవార్డు: 1. సుబేదార్ చెనంద అచ్చయ్య కుటప్ప (బాక్సింగ్), 2. విజయ్ శర్మ (వెయిట్‌లిఫ్టింగ్), 3. ఏ. శ్రీనివాస రావు (టేబుల్ టెన్నిస్), 4. సుఖ్‌దేవ్ సింగ్ పన్ను పాను (అథ్లెటిక్స్), 5. క్లారెన్స్ లోబో (హాకీ/ లైఫ్‌టైమ్), 6. తారక్ సిన్హా (క్రికెట్/ లైఫ్‌టైమ్), 7. జీవన్ కుమార్ శర్మ (జూడో/ లైఫ్‌టైమ్), 8. వీఆర్ బిదూ (అథ్లెటిక్స్/ లైఫ్‌టైమ్).
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: 1. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం), 2. జేఎస్‌డబ్ల్యూ (కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద క్రీడాభివృద్ధికి కృషి), 3. ఇషా ఔట్‌రీచ్ (స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్).
వౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ: అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీ.

చిత్రాలు..విరాట్ కోహ్లీ *మీరాబాయి చాను