క్రీడాభూమి

పోగ్బా డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్న్, సెప్టెంబర్ 21: యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం (యూఫా) ఆధ్వర్యంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 3-0 తేడాతో యంగ్ బాయిస్‌ను ఓడించింది. పాల్ పోగ్బా రెండు గోల్స్ చేసి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆట 35వ నిమిషంలో తొలి గోల్ చేసిన పోగ్బా 44వ నిమిషంలో తనకు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్నాడు. 66వ నిమిషంలో ఆంథోనీ మార్షల్ గోల్ సాధించడంతో మాంచెస్టర్ యునైటెడ్ ఆధిక్యం 3-0కు పెరిగింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆత్మరక్షణలో పడిన యంగ్ బాయిస్ చివరి వరకూ కోలుకోలేకపోయింది. ప్రత్యర్థి నుంచి ఆశించిన స్థాయిలో ప్రతిఘటన లేకపోవడంతో, ఈ మ్యాచ్‌ని మాంచెస్టర్ యునైటెడ్ ఒక రకంగా ప్రాక్టీస్ కోసం వినియోగించుకుంది.
రోమాతో జరిగిన మ్యాచ్‌ని రియల్ మాడ్రిడ్ కూడా 3-0 ఆధిక్యంతోనే సొంతం చేసుకుంది. ఇస్కో 45వ నిమిషంలో మొదటి గోల్ చేయగా, గారెత్ బాలే 58వ నిమిషంలో గోల్ సాధించాడు. ఇంజురీ టైమ్‌లో మరియానో చేసిన గోల్‌తో రియల్ మాడ్రిడ్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కాగా, బెనిఫిషియాను బయెర్న్ మ్యూనిచ్, వలెన్షియాను జువెంటాస్ 2-0 గోల్స్ తేడాతో ఓడించాయి. లియాన్ 2-1 ఆధిక్యంతో మాంచెస్టర్ సిటీపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. సీఎస్‌కే మాస్కో, పిజెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి.