క్రీడాభూమి

బంగ్లాదేశ్‌పై భారత్ అలవోక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 21: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ విజయ పరంపరలను కొనసాగిస్తున్నది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను సునాయాసంగా ఓడించిన ఈ జట్టు శుక్రవారం బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా, బ్యాటింగ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రతిభ కనబరిచారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయ, 36.2 ఓవర్లలో ఛేదించింది. శిఖర్ ధావన్ (40), అంబటి రాయుడు (13), మహేంద్ర సింగ్ ధోనీ (33) ఔట్‌కాగా, రోహిత్ శర్మ 83, దినేష్ కార్తీక్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. మరో 82 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయా న్ని సాధించడం విశేషం.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ పరుగుల కోసం నానా తంటాలు పడింది. టెయిలెండ్‌లో కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజా, మెహదీ హసన్ మీర్జా ఆదుకోకపోతే 150 పరుగుల మైలురాయిని దాటి ఉండేది కాదు. టాప్ ఆర్డర్‌లో ముష్ఫికర్ రహీం (21), మహమ్మదుల్లా (25), చివరిలో మొర్తాజా (26), మెహదీ హసన్ (42) భారత బౌలింగ్‌కు కొంత వరకూ ఎదురునిలవడంతో బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులు చేయగలిగింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 29 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 32 పరుగులిచ్చి రెండు, జస్‌ప్రీత్ బుమ్రా 37 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు. మొత్తం మీద బంగ్లాదేశ్ భారీ స్కోరును చేయలేకపోవడం భారత్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ చక్కటి ఆటతో రాణించడంతో, లక్ష్యాన్ని అందుకోవడం కష్టం కాలేదు. కాగా, అఫ్గానిస్తాన్ చేతిలో ఓటమిపాలై తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న బంగ్లా దేశ్ ఈ మ్యాచ్‌లో కనీస పోటీ కూడా ఇవ్వలేక పరిస్థిని మరింత సంక్లిష్టం చేసుకుంది.