క్రీడాభూమి

శ్రీకాంత్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్జూ (చైనా), సెప్టెంబర్ 21: చైనా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటానికి తెరపడింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అతను జపాన్ క్రీడాకారుడు కెన్టో మొమొతా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. గట్టిపోటీనిస్తాడని అనుకున్న శ్రీకాంత్ అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ, 9-21, 11-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. కాగా, శ్రీకాంత్‌ను ఓడించిన మొమొతా సెమీ ఫైనల్‌లో షి యుకీతో తలపడతాడు. అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్‌లో యుకీ 21-12, 21-15 ఆధిక్యంతో ఆగ్నస్ ఇంగ్ నా లాంగ్‌పై విజయం సాధించాడు. రెండో సెమీ ఫైనల్‌లో ఆంథోనీ సినిసుకా జింటింగ్, చౌ తియాన్ చెన్ ఢీ కొంటారు. జింటింగ్ 18-21, 22-20, 21-6 ఆధిక్యంతో చెన్ లాంగ్‌పై గెలుపొందాడు. మొదటి సెట్‌ను చేజార్చుకున్న అతను రెండో సెట్‌ను అతి కష్టం మీద సొంతం చేసుకున్నాడు. కీలకమైన చివరి సెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి లాంగ్‌పై విజయభేరి మోగించాడు. తియాన్ చెన్ 21-17, 21-14 తేడాతో సన్ వాన్ హోపై గెలుపొంది సెమీస్‌లో చోటు సంపాదించుకున్నాడు.
ముగిసిన భారత్ పోరాటం
శ్రీకాంత్ పరాజయంతో చెనా ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు కూడా ఓటమిని చవిచూసింది. ఆమెను చెన్ యుఫెయ్ 21-11, 11-21, 21-15 ఆధిక్యంతో ఓడించి, సెమీస్ చేరగా, సింధు ఇంటిదారి పట్టింది. ఫైనల్‌లో స్థానం కోసం యుఫెయ్ తన తర్వాతి మ్యాచ్‌లో అకానే యమాగూచితో తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో యమాగూచీ 21-19, 21-16 స్కోరుతో హీ బింగ్‌జియావోపై గెలుపొందింది. రెండో సెమీస్‌లో కరోలినా మారిన్, నొజోమీ ఒకుహరా ఢీ కొంటారు. మారిన్ 21-10, 24-22 తేడాతో గవో ఫాంగ్‌జీని ఓడించగా, ఒకుహరా 21-15, 19-21, 21-15 ఆధిక్యంతో గ్రెగొరియా హరిస్కా టుంగ్‌జుంగ్‌పై విజయాన్ని నమోదు చేసింది.