క్రీడాభూమి

‘లయన్స్’తో పోరుకు ధోనీ సేన సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 28: ఐపిఎల్‌లో గత ఏడాది వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కలిసి ఆడి, ఇప్పుడు రెండు వేర్వేరు జట్లకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా మధ్య పోరు మరోసారి తెరపైకి రానుంది. ఐపిఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు శుక్రవారం తలపడనుండడంతో ఇద్దరిలో గెలుపు ఎవరిదన్నది ఉత్కంఠ రేపుతోంది. రైజింగ్ పుణెకు ధోనీ నాయకత్వం వహిస్తుండగా, గుజరాత్ లయన్స్ జట్టుకు రైనా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఓడించిన రైజింగ్ పుణె ఆతర్వాత వరుసగా నాలుగు పరాజయాలను చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కి వర్షం వల్ల అంతరాయం ఏర్పడగా, డక్‌వర్త్ లూయిస్ విధానంలో గెలిచింది. వరుస ఓటముల తర్వాత లభించిన విజయం రైజింగ్ పుణె ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది. గుజరాత్ లయన్స్ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలను సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ జట్టుకు సన్‌రైజర్స్ మాత్రమే షాకివ్వగలిగింది. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణెను ఈ జట్టు ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న ధోనీ సేన ఎంత వరకూ రైనా బృందాన్ని నిలువరిస్తుందో చూడాలి. ఇరు జట్లలోనూ సమర్థులున్నారు. హార్డ్ హిట్టర్లు ఉన్నారు. ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తావున్న వారున్నారు. సుమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈరెండు జట్ల మధ్య పోరు ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది.