క్రీడాభూమి

క్రీడాకారులకు సంపూర్ణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: టోక్యోలో 2020లో జరిగే ఒలింపిక్స్‌తోపాటు 2022 ఆసియా గేమ్స్, కామనె్వల్త్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులు పతకాలు సాధించే దిశగా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆదివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు. రానున్న రెండేళ్ల కాలంలో జరిగే ఒలింపిక్స్‌పై క్రీడాకారులు దృష్టి సారించాలని, ఇందులో పతకాలు సాధించలేనివారు ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్‌లోనైనా పతకాలు సాధించే దిశగా ప్రయత్నించాలని సూచించాడు. గతంలో పతకాలు సాధించని క్రీడాకారులకు నిధుల సమస్య ఎదురయ్యేదని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని అంటూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసియా గేమ్స్, కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించే దిశగా క్రీడాకారులు తమ వంతు కృషి చేయాలని అభిలషించాడు. క్రీడాకారులకు అవసరమైన నిధుల కోసం వివిధ కార్పొరేట్ కంపెనీలు, అభిరుచి కలిగిన సంస్థలు, వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నాడు. క్రీడల్లో ఉత్తములుగా రాణించాలని, అందుకు తగిన ప్రోత్సాహం తమ తరఫున ఉంటుందని పేర్కొన్నాడు.