క్రీడాభూమి

నైపుణ్యం గల సింగిల్స్ ఆటగాళ్లు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 23: టెన్నిస్ సింగిల్స్‌లో అద్భుత నైపుణ్యం, ప్రతిభా పాటవాలు కలిగిన ఆటగాళ్ల అవసరం ఇపుడు ఎంతైనా ఉందని భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ అన్నాడు. ఆదివారం ఇక్కడ పీటీఐ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ సెర్బియాలో ఇటీవల జరిగిన డేవిస్ వరల్డ్ కప్‌లో భారత్ నిరాశపరచిన విషయాన్ని ప్రస్తావిస్తూ వరల్డ్ కప్ వంటి పోటీల్లో అద్భుతంగా రాణించేందుకు ఆటలో రాటుదేలిన సింగిల్స్ ఆటగాళ్ల అవసరం ఏర్పడిందని పేర్కొన్నాడు. ఈ దిశగా దృష్టి సారించాలన్నాడు. టెన్నిస్ డబుల్స్ విభాగంలో వేలెత్తి చూపే అవకాశం లేదని, కానీ సింగిల్స్‌లో తలపడే అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలన్నాడు. సింగిల్స్‌లో ఇపుడున్న క్రీడాకారులు రామ్‌కుమార్ రామ్‌నాథన్, యుకీ బాంబ్రీ వంటి వారు అద్భుతంగా రాణిస్తున్నారని, కానీ ఫిట్నెస్‌పై మరింత దృష్టి సారించి కష్టపడితే మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.