క్రీడాభూమి

మూడు ఫార్మెట్స్‌లోనూ కివీస్ కెప్టెన్‌గా విలియమ్‌సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఏప్రిల్ 28: స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్‌సన్‌కు టెస్టు, వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కింది. వనే్డ, టి-20 ఇంటర్నేషనల్స్ నుంచి బ్రెండన్ మెక్‌కలమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, అప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విలియమ్‌సన్‌కే ఈరెండు ఫార్మెట్స్‌లోనూ పగ్గాలు అప్పచెప్పాలని నిర్ణయించినట్టు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. విలియమ్‌సన్ సమర్థుడని, జట్టులోని ఆటగాళ్లందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించగలడని పేర్కొన్నాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా ఆడడం అతని అలవాటేనని తెలిపాడు. కేన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన మార్టిన్ క్రోకు అసలు సిసలైన వారసుడిగా విలియమ్‌సన్ పేరు సంపాదించాడు. అతనికి అన్ని ఫార్మెట్స్‌లోనూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పడం సరైన నిర్ణయమని పలువురు మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.