క్రీడాభూమి

చైనాతో మ్యాచ్ మేలు చేకూర్చేదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: బలమైన చైనా జట్టుతో వచ్చే నెలలో జరుగనున్న స్నేహపూర్వక మ్యాచ్ రానున్న ఆసియా కప్‌లో తాము పూర్తి సన్నద్ధతకు మేలు చేకూర్చుతుందని భారత ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ కాన్‌స్టంటైన్ అన్నాడు. అక్టోబర్ 13న జియాంగ్‌సూ ప్రావిన్స్‌లోని సుజ్‌హో ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో చైనాతో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో కాన్‌స్టంటైన్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చైనా వంటి బలమైన జట్టుతో తలపడడం తమకు చాలా కష్టసాధ్యమని, కానీ ఈ తరహా గేమ్స్ ఆడడమే తమకు ప్రస్తుతం కలిసొచ్చే అంశమని అన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆసియా కప్‌నాటికల్లా జట్టులోని సభ్యులంతా ఫిట్నెస్ సమస్యలేమీ లేకుండా ఉంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. తొలిసారిగా భారత సీనియర్ నేషనల్ టీమ్ చైనాలో పర్యటిస్తోందని అన్నాడు. భారత్-చైనా దేశాల జట్లు ఇప్పటివరకు 17సార్లు తలపడ్డాయని, అవన్నీ కూడా భారత గడ్డపైనేనని అన్నాడు. 1997లో కొచ్చిలో జరిగిన నెహ్రూ కప్‌లో చివరిసారిగా ఈ రెండు దేశాల జట్లు తలపడ్డాయని అన్నాడు. ఈ 17 మ్యాచ్‌లలో 12 మ్యాచ్‌లలో చైనా విజయం సాధించగా, ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయని పేర్కొన్నాడు.