క్రీడాభూమి

నన్ను బలిపశువును చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 24: శ్రీలంక క్రికెట్ బోర్డు తనను బలిపశువును చేసిందని కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌లో ఘోరవైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆసియా కప్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు తననొక్కడినే బాధ్యుడిని చేస్తూ కెప్టెన్సీ నుంచి తొలగించే ఏకపక్ష నిర్ణయంపై వాపోయాడు. 3ఆసియా కప్‌లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు పేలవ ప్రదర్శన చేసినందుకు బాధ్యుడిని చేస్తూ నన్ను బలిపశువును చేశారు2 అని ఆయన క్రికెట్ బోర్డుకు లేఖ రాశాడు. త్వరలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, టీ-20 మ్యాచ్‌ల నుంచి కూడా తప్పుకోవాలని లంక బోర్డు మాథ్యూస్‌ను ఆదేశించింది. అంతేకాకుండా వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే పలు మ్యాచ్‌లలో ఆడేందుకు వీలుగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తక్షణం తప్పుకుని ఆ బాధ్యతలను దినేష్ చండీమల్‌కు అప్పగించాలని జట్టు జాతీయ సెలక్టర్లు కోరారు. అయితే, తనను ఉన్నఫలంగా ఎందుకు తొలగించారో తనకు అర్థం కావడం లేదని మాథ్యూస్ వాపోయాడు. ఆసియా కప్‌లో అతి తక్కువ ర్యాంక్‌లు కలిగిన అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల చేతుల్లో నాకౌట్ దశలోనే నిష్క్రమించడానికి కెప్టెన్‌గా తాను ఒక్కడినే బాధ్యుడిని కానని అన్నాడు.
కెప్టెన్‌గా చండీమల్
ఇదిలావుండగా, ఆసియా కప్ నుంచి శ్రీలంక నిష్క్రమించడంతో జట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని, వచ్చేనెల 10 నుంచి ఇంగ్లాండ్‌తో టూర్‌కు మాథ్యూస్ స్థానంలో దినేష్ చండీమల్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వెంటనే తప్పుకోవాలని మాథ్యూస్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు కోరింది. కాగా, చండీమల్ గతంలో టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మళ్లీ ఇపుడు ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లే శ్రీలంక జట్టు మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.