క్రీడాభూమి

మిడిలార్డర్ రాణిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా మంచి ఊపు మీద ఉంది. ఫైనల్ పోరుకు భారత్ చేరుకోవడం దాదాపు ఖాయమైనా మంగళవారం జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఆదివారం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మరో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ప్రత్యర్థిని మట్టి కరిపించింది. మంగళవారం భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో టీమిండియాలో మిడిలార్డర్‌పైనే జట్టు ఆశలు పెట్టుకుంది. భారత్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లలో భాగంగా హాంకాంగ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను ఓడించి మంచి ఊపుమీద ఉన్నప్పటికీ మంగళవారం జరిగే మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టులో రషీద్ ఖాన్ శక్తిసామర్థ్యాలను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. ఆసియా కప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మ (269), వైస్‌కెప్టెన్ శిఖర్ ధావన్ (327) పరుగులతో ఆకట్టుకున్నారు. అయితే, జట్టులోని మిడిలార్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుండడంతో మంగళవారం నాటి మ్యాచ్‌లో మిడిలార్డర్ రాణిస్తే విజయం భారత్ వశం కావచ్చునని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. టీమిండియాలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తర్వాత అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌లలో అంబటి రాయుడు (116) ఉన్నాడు. ప్రత్యర్థి లైనప్ పటిష్టంగా ఉండి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడితే ఆ బాధ్యతలను మిడిలార్డర్‌లోని అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ వంటివారు తమ భుజానికి ఎత్తుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి జట్టులోని బౌలర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ వంటివారు భారత్ బ్యాట్స్‌మెన్‌లపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో తలపడే ముందు మిడిలార్డర్ అత్యంత కీలక బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. భారత్‌లో స్పిన్నర్లు, పేసర్లు కలసి ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో యుజ్వేంద్ర చాహల్ (5), కుల్దీప్ యాదవ్ (5), జస్ప్రీత్ బుమ్రా (7), భువనేశ్వర్ కుమార్ (6) వికెట్లు పడగొట్టి నిలకడగా రాణిస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా మళ్లీ తమ పూర్వ ఫామ్‌ను కొనసాగిస్తుండడంతో భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇక మరోపక్క టీమిండియాతో తలపడే అఫ్గానిస్తాన్ ప్రత్యర్థిని ఓడించడం ద్వారా ఆసియా కప్‌లో చక్కటి ముగింపు పలకవచ్చునని యోచిస్తోంది. ఇప్పటికే శ్రీలంక గ్రూప్ మ్యాచ్‌ల నుంచి, బంగ్లాదేశ్ లీగ్ దశ నుంచి నిష్క్రమించడంతో తమ అనుభవాన్నంతటినీ రంగరించి ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని అఫ్గనిస్తాన్ తహతహలాడుతోంది.