క్రీడాభూమి

విజయాలతో చెస్ ఒలింపియాడ్‌కు భారత్ శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాటుమి (జార్జియా), సెప్టెంబర్ 25: 43వ చెస్ ఒలింపియాడ్‌ను భారత క్రీడాకారులు విజయాలతో ఆరంభించారు. మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభమైన పోటీల్లో మహిళల జట్టు న్యూజీల్యాండ్‌పై 4-0 తేడాతో విజయం సాధించింది. కోనేరు హంపి, ఈషాకరావడే, పద్మినీ రౌత్‌లు సునాయాస విజయాలను నమోదు చేయగా, టీనాసచ్‌దేవ్ మాత్రమే కొంత తడబాటుకు గురయింది. విశ్వనాథన్ ఆనంద్‌కు విశ్రాంతినిచ్చిన తొలిరోజు పోటీల్లో కృష్ణన్ శశికిరణ్ ఫోర్త్‌బోర్డులో అర్థపాయింట్‌తో వెనుకంజవేశారు. ఐతే పి.హరికృష్ణ, విదిత్ గుజరాతీ, బి. అదిబన్‌లు విజయాలను తొలి మూడు బోర్టుల్లో నమోదు చేసి జట్టు విజయానికి దోహదం చేశారు. భాతర జట్టుకు రెండు మ్యాచ్ పాయింట్లు వచ్చాయి. కాగా టోర్నీ ప్రారంభ సెషన్స్‌లో 184 జట్లు పాల్గొనగా ఇందులో 64 జట్లు 4-0 స్కోరును సాధించగా, 17 జట్లు కేవలం అర్థపాయింట్‌తోనే సరిపెట్టుకున్నాయి.