క్రీడాభూమి

హర్షల్ ఆల్‌రౌండ్ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూర్ (కర్నాటక), డిసెంబర్ 13: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌పై హర్యానా పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అక్షర్ పటేల్ కేవలం 21 పరుగులకే ఐదు వికెట్లు సాధించడమేగాక, బ్యాటింగ్‌లోనూ రాణించి 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనితోపాటు మూడు వికెట్లు కూల్చిన అమిత్ మిశ్రా కూడా అద్భుత ప్రతిభ కనబరచడంతో అల్లాడిన జమ్మూ కశ్మీర్ జట్టు 22 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. బందీప్ సింగ్ (24), జహూర్ సోఫీ (20 నాటౌట్) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. అమిత్ మిశ్రా కేవలం నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హర్యానా 11 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా 76 పరుగులు చేసింది.
ఇతర మ్యాచ్‌ల్లో, మహారాష్ట్ర 111 పరుగుల తేడాతో త్రిపురపై గెలిచింది. విదర్భ ఏడు వికెట్ల ఆధిక్యంతో బరోడాను చిత్తుచేసింది. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. కేరళను జార్ఖండ్ ఐదు వికెట్ల ఆధిక్యంతో ఓడించింది. మధ్య ప్రదేశ్ చేతిలో గోవా 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రైల్వేస్‌పై గుజరాత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. కాగా, విజేత జట్టుకు నా లుగు పాయంట్లు లభిస్తాయ.

హోల్డర్‌కు జరిమానా

దుబాయి, డిసెంబర్ 13: ఆస్ట్రేలియాతో హోబర్ట్‌లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు మ్యాచ్ ఫీజులో సగం మొత్తాన్ని జరిమానాగా విధిస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వర్షం లేదా ఇతర కారణాలవల్ల ఆటను నిలిపివేయకపోతే, టెస్టు మ్యాచ్‌ల్లో ఒక రోజు ఆటలో 90 ఓవర్లు బౌల్ కావాలి. అంతకంటే ఎక్కువ ఓవర్‌రేట్ నమోదైతే, సదరు జట్టు కెప్టెన్‌తోపాటు జట్టులోని ఆటగాళ్లందరు కూడా జరిమానా చెల్లించుకోక తప్పదు. ఇలావుంటే టెస్టు కెప్టెన్‌గా స్లో ఓవర్ రేటింగ్‌లో జరిమానాను ఎదుర్కోవడం హోల్డర్‌కు ఇది రెండోసారి. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమైతే, అతనిని ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
ఓపెనర్‌గా షాన్ లేదా ఖాజా
హోబర్ట్: వెస్టిండీస్‌తో ఈనెల 26 నుంచి మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టులో తమ ఇన్నింగ్స్‌ను షాన్ మార్ష్ లేదా ఉస్మాన్ కాజా ఆరంభిస్తారని ఆస్ట్రేలియా జట్టు చీఫ్ కోచ్ డారెన్ లీమన్ చెప్పాడు. మెల్బోర్న్‌లో జరిగే ఈ టెస్టుకు ఖాజా అందుబాటులో ఉంటాడని చెప్పాడు. కండరాలు బెణకడంతో జట్టుకు కొంతకాలం ఖాజా దూరంకాగా, అతని స్థానంలో షాన్ మార్ష్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన ఆ టెస్టు మొదటి లో అతను కెరీర్‌లోనే అత్యుత్తమంగా 182 పరుగులు సాధించాడు. దీనితో షాన్‌ను పక్కకు పెట్టే ఆలోచన చేసే పరిస్థితి కూడా జట్టు మేనేజ్‌మెంట్‌కు లేకపోయింది. రెండో టెస్టు కోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించగా, అందులో షాన్, ఖాజా కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నందున, మెల్బోర్న్ టెస్టులో ఎవరికి అవకాశం లభిస్తుందన్న ప్రశ్నకు లీమన్ నేరుగా సమాధానం చెప్పలేదు. ఇద్దరిలో ఒకరు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని అన్నాడు. షాన్ అసాధారణమైన ఫామ్‌ను కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఖాజా గాయం నుంచి కోలుకొని, తిరిగి రావడంతో ఆసీస్ బ్యాటింగ్ మరింత బలపడిందని చెప్పాడు. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్న కారణంగా, తుది జట్టును ఎంపిక చేయడం అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. ఇలావుంటే, అంతకు ముందు అడెలైడ్‌లో జరిగిన మొట్టమొదటి డే/నైట్ టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించడంలో షాన్ కీలక పాత్ర పోషించాడు. అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో అతను రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసి, ఆసీస్‌ను గెలిపించాడు. విండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. కెరీర్‌లోనే తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ఈ కోణం నుంచి చూస్తే, ఖాజా కంటే షాన్‌వైపే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.