క్రీడాభూమి

నా అత్యుత్తమ ఇన్నింగ్స్ అదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తన టి-20 కెరీర్‌లో గుజరాత్ లయన్స్‌తో బుధవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమమైనదని ఢిల్లీ డేర్‌డెవిల్స్ సూపర్ హీరో క్రిస్ మోరీ అన్నాడు. 10.4 ఓవర్లలో 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన డేర్‌డెవిల్స్‌కు అండగా నిలిచిన మోరిస్ 32 బంతుల్లో అజేయంగా 82 పరుగులు సాధించాడు. జీన్ పాల్ డుమినీ (43 బంతుల్లో 48 పరుగులు)తో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి, జట్టును విజయం ముంగిట నిలిపాడు. చివరి రెండు ఓవర్లను ప్రవీణ్ కుమార్, డ్వెయిన్ బ్రేవో అద్భుతంగా బౌల్ చేయడంతో డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 171 పరుగులు చేయగలిగింది. సంక్లిష్టమైన సమయంలో క్రీజ్‌లో నిలదొక్కుకొని చేసిన 82 పరుగుల స్కోరు తన కెరీర్‌లోనే ఉత్తమమైనదని మోరిస్ తెలిపాడు. చివరి వరకూ కష్టపడ్డామని, కానీ మ్యాచ్‌ని గెల్చుకొని ఉంటే ఎంతో సంతోషించి ఉండేవాడినని పేర్కొన్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్