క్రీడాభూమి

సమాచార లోపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రభుత్వ సంస్థలకు, గోల్ఫ్‌కు మధ్య సమాచార లోపం కారణంగా అదితి అశోక్ అర్జున అవార్డును కోల్పోయింది. మహిళా గోల్ఫ్ అసోసియేషన్ మంగళవారం నాడిక్కడ ఈ విషయంపై విచారం వ్యక్తం చేసింది. అర్జున అవార్డుల జాబితాలో అదితి అశోక్ పేరు లేకపోవడం తమకు షాక్‌కు గురిచేసిందని డబ్ల్యుజిఏఎల్ సెక్రటరీ జనరల్ చంపికా సాయల్ చెప్పారు. అతిచిన్న వయసులోనే అదితి లల్లా ఐచా టూర్ స్కూల్ టైటిల్ గెలుపొందిన తొలి భారత క్రీడాకారిణిగా నిలివడంతోబాటు 2016లో యూరోపియన్ టూర్ కార్డును సైతం ఆమె దక్కించుకుంది. ఇరవై ఏళ్ల అదితి 2016 హీరో ఉమెన్స్ ఓపెన్‌లో గెలుపొంది యూరోపియన్ టూర్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. కాగా డబ్ల్యుజిఏఐకి అదితికి సంబందించిన ఎలాంటి సమాచారమూ అందించకుండా ఇండియన్ గోల్ఫ్ యూనియన్ నిర్లక్ష్యం వహించడం శోచనీయమని చంపికా సాయెల్ విచారం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అవార్డుకు ఎంపిక కావలసిన క్రీడాకారిణిని ఇలా వంచించడం తగదని ఆమె అన్నారు. కాగా ఇదే విషయమై ఐజీయూ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బిభుతి భూషణ్‌ను వివరణ కోరగా గోల్ఫర్ అదితి తన అప్లికేషన్‌పై సంతకం చేయలేదని, అందువల్లే ఆమె అర్జున అవార్డుకు ఎంపిక కాలేదన్నారు. ఈ యేడాది తాము సుభాంకర్ శర్మ, అశోక్ అదితిల పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించామని, అయితే దరఖాస్తుపై అదితి సంతకం కోసం చివరి నిమిషం వరకు వేచిచూసినా ఆమె రాలేదని బిభుతి భూషణ్ స్పష్టం చేశారు. ఈ యేడాది సుభాంకర్ శర్మ ఒక్కరే గోల్ఫ్ తరపున అర్జున అవార్డును అందుకున్నారు.