క్రీడాభూమి

క్రికెట్‌కు షాబుద్దీన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఆల్‌రౌండర్ సయ్యద్ షాబుద్దీన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అతను 80 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2,567 పరుగులు సాధించాడు. 248 వికెట్లు పడగొట్టాడు. 2013 తర్వాత అతనికి దేశవాళీ పోటీల్లో ఆడే అవకాశం రాలేదు. అనంతపురం జిల్లాలోని కదిరికి చెందిన షాబుద్దీన్ హైదరాబాద్ అండర్-22 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆతర్వాత ఆంధ్ర క్రికెట్ సంఘం అతనికి జట్టులో స్థానం కల్పించింది. వివాదం సృష్టించిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసిఎల్) మొదలైనప్పుడు ఆ టోర్నీలో ఆడేందుకు కాంట్రాక్టు కుదుర్చుకోవడం షాబుద్దీన్‌కు శాపమైంది. తర్వాతి కాలంలో ఐసిఎల్ ఆటగాళ్లపై నిషేధాన్ని బిసిసిఐ ఎత్తివేసినప్పటికీ, చాలా మంది ఆటగాళ్ల మాదిరిగానే షాబుద్దీన్‌కు కూడా సరైన అవకాశాలు రాలేదు. జాతీయ జట్టుకు ఎంపికయ్యే సామర్థ్యం ఉన్నప్పటికీ, సెలక్టర్లు అతని పట్ల మొగ్గు చూపలేదు. ఫలితంగా అతని సేవలు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కే పరిమితమయ్యాయి.