క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీస్‌కు సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 29: ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో స్థిరంగా ముందుకు సాగుతున్న ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనాలోని ఉహాన్‌లో జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ షిగ్జియాన్ వాంగ్‌పై వరుస గేముల తేడాతో విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సుదీర్ఘ ర్యాలీలతో సాగిన ఈ పోరులో సైనా 21-16, 21-19 తేడాతో మట్టికరిపించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతున్న సైనా నెహ్వాల్ ఇటీవల సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్నప్పటికీ అంతకుముందు స్విస్ గ్రాండ్‌ప్రీ గోల్డ్, ఇండియా సూపర్ సిరీస్, మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరుకున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆమె ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్థానం కోసం చైనాకు చెందిన ఇహన్ వాంగ్‌తో గానీ లేక జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరాతో గానీ తలపడనుంది.