క్రీడాభూమి

ప్రపంచ కప్ ఆర్చరీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, ఏప్రిల్ 29: ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్ మొదటి స్టేజ్‌లో భారత మహిళల రికర్వ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో దీపికా కుమారి, బొంబైలా దేవి, లక్ష్మీరాణి మాజీలతో కూడిన భారత జట్టు 5-3 తేడాతో టాప్‌సీడ్ జర్మనీ జట్టుపై విజయం సాధించింది. గురువారం జరిగిన వ్యక్తిగత ఈవెంట్లలో ఈ ముగ్గురు పేలవమైన ప్రదర్శనతో నిరాశపర్చినప్పటికీ శుక్రవారం విజృంభించి జర్మన్లను మట్టికరిపించారు. దీంతో భారత జట్టు పసిడి పతకం కోసం చైనీస్ తైపీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. కాగా, ఈ టోర్నీలో ఏడోసీడ్‌గా బరిలోకి దిగిన చైనీస్ తైపీ జట్టు మరో సెమీఫైనల్‌లో రష్యాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ సెమీఫైనల్‌లో చైనీస్ తైపీ ర్యాంకింగ్స్‌లో తమ కంటే ఉన్నత స్థానంలో ఉన్న రష్యాపై 6-0 తేడాతో విజయం సాధించడం విశేషం. ఇదిలావుంటే, ఈ టోర్నీ కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్లు మెడల్ రౌండ్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ, పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌తో పాటు మిక్స్‌డ్ పెయిర్ విభాగంలో పతకాల కోసం భారత్ రేసులో కొనసాగుతోంది. ఈ టోర్నీలో కాంపౌండ్ విభాగానికి చెందిన ఫైనల్ పోటీలు శనివారం జరుగుతుండటంతో రికర్వ్ విభాగానికి చెందిన మెడల్ ఈవెంట్లన్నింటినీ ఆదివారం నిర్వహించనున్నారు.

chitram దీపికా కుమారి