క్రీడాభూమి

తిరుగులేని లయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 29: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్ లయన్స్ జట్టు మరో విజయంతో సత్తా చాటుకుంది. పుణెలోని ఎంసిఎ (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్) స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో ఆతిథ్య రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టును ఓడించి ఆరవ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్‌లో ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (101) సెంచరీతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు రాబట్టింది. అయితే అందుకు దీటుగా జవాబిచ్చిన గుజరాత్ లయన్స్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా చక్కగా రాణించారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 196 పరుగులు రాబట్టి లక్ష్యాన్ని అధిగమించడంతో స్మిత్ శతకం వృథా అయింది. టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు 13 పరుగులకే సౌరభ్ తివారీ (1) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఓపెనర్ అజింక్యా రహానే, స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వీరు చూడముచ్చటైన షాట్లతో అలరించి 111 పరుగుల భాగస్వామ్యంతో స్కోరు బోర్డును పరుగులు తీయించారు. అనంతరం రహానే (53) రనౌట్‌గా వెనుదిరగ్గా, అతని స్థానంలో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకుని స్మిత్‌కు సహకరించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకుని 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్ 101 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డ్వెయిన్ బ్రావో బౌలింగ్‌లో నిష్క్రమించాడు. చివర్లో ధోనీ (30), థిసార పెరీరా (3) అజేయంగా నిలవడంతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.
అనంతరం 196 పరుగుల లక్ష్యంతో గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్లు డ్వెయిన్ స్మిత్, బ్రెండన్ మెక్‌కలమ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. క్రీజ్‌లో నిలదొక్కుకుని పుణె బౌలర్లను సమర్థవంతగా ప్రతిఘటించిన వీరు 93 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి శుభారంభాన్ని అందించారు. అనంతరం మెక్‌కలమ్ (43) తొమ్మిదో ఓవర్‌లో రజత్ భాటియా వేసిన బంతిని ఎదుర్కోబోయి అల్బీ మోర్కెల్‌కు క్యాచ్ ఇవ్వగా, కొద్దిసేపటికి డ్వెయిన్ స్మిత్ (37 బంతుల్లో 63 పరుగులు) థిసార పెరీరా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో గుజరాత్ లయన్స్ జట్టు 115 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ తరుణంలో కెప్టెన్ సురేష్ రైనా, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కొద్దిసేపు ప్రత్యర్థి బౌలర్లను ప్రతిఘటించి మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అనంతరం దినేష్ కార్తీక్ (20 బంతుల్లో 33 పరుగులు) అశోక్ దిండా బౌలింగ్‌లో రహానే చేతికి చిక్కగా, డ్వెయన్ బ్రావో (7), రవీంద్ర జడేజా (0), సురేష్ రైనా (28 బంతుల్లో 34 పరుగులు), ఇశాన్ కిషన్ (0) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ జేమ్స్ ఫాల్క్‌నర్ (9), ప్రవీణ్ కుమార్ (0) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తిచేశారు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు రాబట్టిన గుజరాత్ లయన్స్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సంక్షిప్తంగా స్కోర్లు
రైజింగ్ పుణె సూపర్ జెయంట్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 195/3 (స్టీవ్ స్మిత్ 101, అజింక్యా రహానే 53, మహేంద్ర సింగ్ ధోనీ 30-నాటౌట్). వికెట్ల పతనం: 1-13, 2-124, 3-188. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 196/7 (డ్వెయిన్ స్మిత్ 63, బ్రెండన్ మెక్‌కలమ్ 43, సురేష్ రైనా 34, దినేష్ కార్తీక్ 33, డ్వెయిన్ బ్రావో 7, జేమ్స్ ఫాల్క్‌నర్ 9-నాటౌట్). వికెట్ల పతనం: 1-93, 2-115, 3-166, 4-180, 5-180, 6-193, 7-193.

chitram స్టీవ్ స్మిత్ శతకం వృథా

ఐపిఎల్‌లో నేడు

ఢిల్లీ డేర్‌డెవిల్స్
కోల్‌కతా నైట్ రైడర్స్
న్యూఢిల్లీలో సాయంత్రం 4 గంటల నుంచి
సన్‌రైజర్స్ హైదరాబాద్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
హైదరాబాద్‌లో రాత్రి 8 గంటల నుంచి