క్రీడాభూమి

నిన్న సల్మాన్ ఖాన్.. నేడు బింద్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా సుహృద్భావ రాయబారి (గుడ్‌విల్ అంబాసిడర్)గా వ్యవహరించనున్నాడు. సల్మాన్ నియామకంపై విమర్శలను ఎదుర్కొంటున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఎ) ఒలింపిక్ పసిడి పతక విజేత బింద్రాను కూడా శుక్రవారం గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్.రహ్మాన్‌కు కూడా ఈ బాధ్యతలను అప్పగించేందుకు వారితో కూడా ఐఓఎ సంప్రదింపులు జరుపుతోంది. రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి రాయబారిగా వ్యవహరించాలని ఐఓఎ నుంచి ఆహ్వానం అందడంతో అందుకు వెంటనే అంగీకరించానని బింద్రా తెలిపాడు. అయితే ఐఓఎ ప్రతిపాదనపై తెండూల్కర్, రహ్మాన్ ఇప్పటివరకూ స్పందించలేదు.