క్రీడాభూమి

పరిమితి ఓవర్ల సిరీస్‌కు గేల్ మిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా), అక్టోబర్ 8: టీమిండియాతో త్వరలో జరిగే వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, టీ-20 సిరీస్‌లలో వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఆడే అవకాశం లేదు. అతని వ్యక్తిగత కారణాల వల్ల క్రిస్ గేల్ భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ను మిస్ అవుతున్నాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) తెలిపింది. కాగా, జట్టులోకి ముగ్గురు కొత్త ముఖాలను తీసుకున్నారు. భారత్‌తో జరిగే పరిమితి ఓవర్ల క్రికెట్‌కు తమ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ లేకుండానే బరిలోకి దిగుతున్నామని డబ్ల్యూఐసీబీ తెలిపింది. క్రిస్ గేల్ భారత్‌తోపాటు ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగే వివిధ మ్యాచ్‌లలో కూడా ఆడే అవకాశం లేదు. ఇంగ్లాండ్‌తోపాటు వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో క్రిస్ గేల్ అందుబాటులో ఉంటాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్యానల్ ప్రతినిధి కౌర్ట్నీ బ్రౌన్ ఒక ప్రకటనలో తెలిపాడు. వెస్టిండీస్ భారత్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు, ఐదు వనే్డ మ్యాచ్‌లు, మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి వనే్డ ఈనెల 21న గౌహతిలో జరుగుతుంది. ఇదిలావుండగా, వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌తోపాటు 2020లో ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ-20లో పాల్గొనేందుకు వీలుగా జట్టులోకి ముగ్గురు కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నట్టు డబ్ల్యూఐసీబీ పేర్కొంది. ఓపెనర్ చంద్రపాల్ హేమ్‌రాజ్, ఆల్‌రౌండర్ ఫబియన్ అలెన్, ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్‌లను పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం జట్టులోకి తీసుకున్నారు.