క్రీడాభూమి

టాప్‌లోనే కోహ్లీ, బుమ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 8: ఐసీసీ వనే్డ సోమవారం ర్యాంకింగ్స్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా యథాతథంగా తమ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. కోహ్లీ 884 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, 842 పాయింట్లతో వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ధావన్ 802 పాయింట్లతో టాప్-10లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫాస్ట్‌బౌలర్, డెత్‌ఓవర్ల స్పెషలిస్టు జస్ప్రీత్ బుమ్రా 797 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా ఎడమచేతివాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 700 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ 788 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, టీమిండియా పాయింట్లపరంగా 122 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, తొలి స్థానంలో 127 పాయింట్లతో ఇంగ్లాండ్ ఉంది.