క్రీడాభూమి

డిసెంబర్‌లోనే పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: పారుపల్లి కశ్యప్‌తో ప్రేమాయణాన్ని సైనా నెహ్వాల్ ధ్రువీకరించింది. డిసెంబర్‌లో తమ వివాహం జరుగుతుందని ఆమె స్పష్టం చేసింది. బాడ్మింటన్ స్టార్లుగా ఎదిగిన వీరిద్దరి మధ్య ఎం తోకాలంగా సాన్నిహి త్యం ఉందని, వీరు వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా యి. అయితే, ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, అవి పుకార్లు మాత్రమేనన్న వాదన కూడా వినిపించింది. కానీ, 32 ఏళ్ల కశ్యప్‌తో తన ప్రేమ వ్యవహారాన్ని ఒక ఇంటర్వ్యూలో 28 ఏళ్ల సైనా స్వయంగా ప్రకటించింది. 2007 నుంచి తాము ఇద్దరం డేటింగ్ చేస్తున్నామని, అయితే, కెరీర్‌ను దృష్టిలో ఉంచుకొని పెళ్లిని వాయిదా వేసుకున్నామని సైనా తెలిపింది. 2005 నుంచి ఇద్దరం హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందుతున్నామని, అక్కడే ఒకరి పట్ల ఒకరికి ఇష్టం పెరిగిందని చెప్పింది. తీవ్రమైన పోటీ ప్రపంచంలో ఒకరికొకరు చేరువ కావడం, తరచూ కలుసుకోవడం చాలా కష్టమని సైనా చెప్పింది. అయితే, తాము మాత్రం ఏదో ఒక విధంగా మాట్లాడుకునే వాళ్లమని చెప్పింది. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేకపోయిందని, వారు ముందుగానే గుర్తించారని వ్యాఖ్యానించింది. తాను పర్యటనలకు వెళ్లినప్పుడు, వారు కూడా తనతోనే వచ్చేవారని, అందుకే తనకు ఎవరితో ఎక్కువ సాన్నిహిత్యం ఉందనే విషయాన్ని వారు సులభంగానే పసిగట్టారని అన్నది. డిసెంబర్ 16న తమ వివాహం జరుగుతుందని ప్రకటించింది.