క్రీడాభూమి

ఫుట్‌బాల్‌లో బోల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 10: స్ప్రింట్ సూపర్‌స్టార్ ఉసేన్ బోల్ట్ తన చిన్ననాటి కలను నెరవేరేందుకు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా రూపాంతరం చెందనున్నాడు. పరుగుల యంత్రంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా అవతరించిన బోల్ట్ శుక్రవారం సిడ్నీలో జరిగే ఫుట్‌బాల్ పోటీ ద్వారా కొత్త అవతారం ఎత్తనున్నాడు. వాస్తవానికి ఫుట్‌బాల్ అంటే తనకు చిన్ననాటి ఇష్టమని, పరిస్థితుల ప్రభావంతో పరుగుల వీరుడిగా వినుతికెక్కానన్నాడు. ఈ కొత్త అవతారాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటానని అన్నాడు. సిడ్నీలో మకార్థర్ సౌత్ వెస్ట్ యునైటెడ్‌తో సెంట్రల్ కోస్ట్ మారినర్స్ జట్టు తరఫున తొలి ఫ్రెండ్నీ మ్యాచ్ ద్వారా కొత్త క్రీడా జీవితాన్ని ప్రారంభించనున్నాడని కోచ్ మైక్ ముల్వే అన్నాడు. ఇధో గొప్ప ముందడుగని బోల్ట్‌కు సూచించినట్టు కోచ్ తెలిపాడు.