క్రీడాభూమి

సెహ్వాగ్‌తో షాను పోల్చడంపై ఒకటికి రెండుసార్లు ఆలోచించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 10: రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆరంగేట్రం చేసిన వెంటనే సెంచరీ నమోదు చేసిన యువ ఆటగాడు పృథ్వీ షాను సీనియర్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. ఇక్కడ బుధవారం నిర్వహించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన గంభీర్ కాసేపు మాట్లాడాడు. సెహ్వాగ్-్ఫృథ్వీ షాలను పోల్చేముందు ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే భవిష్యత్‌లో మరొకరిని ఆవిధంగా పోల్చలేరని వ్యాఖ్యానించాడు. పృథ్వీ షా ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ను ప్రారంభించాడని, ఎదిగేందుకు ఎంతో భవిష్యత్తు ఉందని అంటూ తానెపుడూ ఒకరితో ఒకరిని పోల్చడాన్ని విశ్వసించనని అన్నాడు. షా సహజమైన ఆటతీరు వేరని, సెహ్వాగ్ ఆటతీరు భిన్నమని అన్నాడు. పృథ్వీ ఇపుడే తన కెరీర్‌ను ప్రారంభించగా, సెహ్వాగ్‌కు ఇప్పటికే 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన చరిత్ర ఉందని పేర్కొన్నాడు. అయితే, ఆరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే అద్భుత ఆటతీరుతో అలరించిన పృథ్వీ షాలో మంచి టాలెంట్ ఉందని, భవిష్యత్తులో ఎన్నో మ్యాచ్‌లలో ఎదురయ్యే సవాళ్లను, ఒడిదుడుకులను తట్టుకుని నిలబడాల్సి ఉంటుందని అన్నాడు.

అవకాశమిస్తే ఆల్‌రౌండర్‌గా రాణిస్తా
* యువ క్రికెటర్ దీపక్ చాహర్
చెన్నై, అక్టోబర్ 10: ఒకపక్క కొత్త బంతి బౌలర్‌గా, మరోపక్క బ్యాట్స్‌మన్‌గా రాణించాలని అనుకుంటున్నానని యువ క్రికెటర్ దీపక్ చాహర్ అన్నాడు. ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆయన ఆ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహా ప్రతిఒక్కర్నీ ఆకట్టుకున్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడినపుడు టీమ్ యాజమాన్యం దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో టీమిండియాలో చోటు దక్కితే కొత్త బంతి వేసే బౌలర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రెండింటిలోనూ రాణించేందుకు తహతహలాడుతున్నానని ఇక్కడ జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ జరిగిన సందర్భంగా ఒక పత్రికా ప్రతినిధితో మాట్లాడుతూ అన్నాడు. జాతీయ జట్టులోకి ఆల్‌రౌండర్ కావాలనుకుంటే తాను అందుకు సిద్ధంగా ఉన్నానని, తానేమిటో నిరూపించుకుంటానని అన్నాడు. ‘వాస్తవంగా నాలో చాలా కష్టపడే తత్వం ఉంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు ఎంతో దోహదపడింది. సీఎస్‌కే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం నా ఆటతీరును మెచ్చుకున్నాడు’ అని దీపక్ చాహర్ అన్నాడు.

వాన్యుయాటుపై భారత్ గెలుపు
* అండర్-18 హకీ పోటీలో సత్తా చాటిన మహిళలు
బ్యూనోస్ ఎయిరెస్, అక్టోబర్ 10: యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో భాగంగా బుధవారం అండర్-18 మహిళల హాకీ పోటీలోలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో భారత జట్టు 16-0తో ఐలాండ్‌కు చెందిన వాన్యుయాటు జట్టును మట్టికరిపించింది. భారత జట్టులో ఫర్వార్డ్ ముంతాజ్ ఖాన్ (8వ, 11వ, 12వ, 15వ నిమిషంలో) నాలుగు గోల్స్ చేయగా, చేతన (6వ, 14, 17 నిమిషంలో) మూడు గోల్స్ చేసింది.