క్రీడాభూమి

‘సుప్రీం’ వ్యాఖ్యలు బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా సేవలు అందించిన జగ్మోహన్ దాల్మియాపై చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలపై అతని భార్య చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేసింది. క్రికెట్ అభివృద్ధికి జీవితకాలం శ్రమించిన అతనిని విమర్శించే అధికారం ఎవరికీ లేదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. భగవంతుడు కూడా దాల్మియాను తప్పుపట్టలేరని వ్యాఖ్యానించింది. ఎవరూ దాల్మియాకు కితాబునివ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 1997-2000 మధ్యకాలంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి చైర్మన్‌గా, 2001 నుంచి 2004 వరకు బిసిసిఐకి అధ్యక్షుడిగా దాల్మియా సేవలు అందించాడు. గత ఏడాది రెండో విడత బిసిసిఐకి, తన 75వ ఏట అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే, ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో దాల్మియా గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, బిసిసిఐ పాలక మండలి సభ్యులకు వయోపరిమితి విధించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. బోర్డు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటున్నామో తెలియకుండానే ఎన్నిక ప్రక్రియ కొనసాగిందని వ్యాఖ్యానించింది. దాల్మియా ఎవరికీ అందుబాటులోకి కూడా రాలేదని పేర్కొంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి కూడా 65 ఏళ్లకు రిటైర్ అవుతున్నారని, బిసిసిఐ పాలక మండలి సభ్యులకు వయోపరిమితి ఎందుకు లేదని ప్రశ్నించింది. దాల్మియా బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు అతని వయసు 75 ఏళ్లని, ఆ వయసులో ఏ విధమైన సేవలు అందిస్తాడని సుప్రీం కోర్టు బెంచ్ అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలపై చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేసింది.

పాక్ కోచ్ పదవికి
డిమాండ్ నిల్!
కరాచీ, ఏప్రిల్ 30: పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి డిమాండ్ కరవైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన ప్రముఖులు ఎవరూ ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకోలేదు. విదేశీ కోచ్‌ని నియమించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారని, ఈ పరిస్థితుల్లో దరఖాస్తు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుందని మోసిన్ ఖాన్, మోయిన్ ఖాన్, అకీబ్ జావేద్ వంటి మాజీ క్రికెటర్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తు చేయడం, వాటిని పిసిబి పరిశీలించడం, చివరికి తమ దరఖాస్తులను పక్కకుపెట్టి విదేశీ కోచ్‌ను నియమించడం జరిగిపోతుందని, కాబట్టి అసలు దరఖాస్తు చేసుకోకుండా ఉంటేనే పరువు నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమచారం ప్రకారం మంజూర్ ఇలాహీసహా ఇద్దరు మాజీ పాక్ క్రికెటర్లు మాత్రమే దరఖాస్తు చేశారు. వసీం అక్రం, రమీజ్ రాజాతో కూడిన సలహా మండలి విదేశీ కోచ్‌ని నియమించాలని సూచించినట్టు సమాచారం. రెండు పర్యాయయాలు ఇంగ్లాండ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన పీటర్ మూర్స్, ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ, జమీ సిడన్, స్టువర్ట్ లా, డీన్ జోన్స్, దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్ తదితర విదేశీ కోచ్‌ల పేర్లను పిసిబి పరిశీలిస్తున్నదని తెలుస్తోంది. ఇటీవల పాక్ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొన్న నేపథ్యంలో వకార్ యూనిస్ హెచ్ కోచ్ పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. అతని స్థానంలో కొత్త కోచ్‌ని నియమించడానికి పిసిబి కసరత్తు చేస్తున్నది.

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో
మలింగ స్థానంలో స్టెయిన్
బ్రిడ్జిటౌన్, ఏప్రిల్ 30: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) టోర్నీలో జమైకా తలవాస్ తరఫున ఆడనున్నాడు. గాయం కారణంగా శ్రీలంక పేసర్ లసిత్ మలింగ వైదొలగిన కారణంగా అతని స్థానంలో స్టెయిన్‌ను తీసుకోవాలని నిర్ణయించినట్టు జమైకా ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. జూన్‌న ఆరంభం కానున్న ఈ టోర్నీ ఆగస్టు 7వ తేదీన ముగగుస్తుంది. 2015 నవంబర్‌లో వెస్టిండీస్ పర్యటనకు వచ్చినప్పుడు మలింగ మోకాలికి గాయమైంది. వైద్య సేవల అనంతరం తగ్గినట్టు కనిపిస్తున్నా తరచు అతనిని వేధిస్తునే ఉంది. ఇటీవల జరిగిన ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో అతను పాల్గొనలేకపోయాడు. అనంతరం ఐపిఎల్‌లో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ వైద్యుల సలహా ప్రకారం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ఓటేసిన గంగూలీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి కోల్‌కతాలోని పోలింగ్ బూత్‌కు వచ్చినప్పుడు అక్కడ ఒక జవానుతో కరచాలనం చేస్తున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ