క్రీడాభూమి

జోరు మీద టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మొదటి టెస్టును ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ ఆధిక్యంతో సొంతం చేసుకున్న టీమిండియా శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండవ, చివరి టెస్టుకు సిద్ధంగా ఉంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ జోరు మీద ఉంటే, విండీస్ శిబిరంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న భారత్‌కు ఎనిమిదో స్థానంలోని విండీస్ ఏ విధంగానూ సమవుజ్జీ కాదన్నది వాస్తవం. దీనికితోడు, గాయాల సమస్య ఆ జట్టును వేధిస్తున్నది. కెప్టెన్ జాసన్ హోల్డర్ పూర్తి ఫిట్నెస్‌తో లేకపోవడంతో, ఈ టెస్టులో ఆడతాడా లేదా అన్నది అనుమానం తలెత్తుతోంది. చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియల్ కూడా గాయం నుంచి ఇంకా బయటపడలేదు. సమర్థులైన ఆటగాళ్లు లేకపోవడం, ఉన్న ఒకరిద్దరు కూడా గాయాల సమస్యతో బాధపడడం వంటి అంశాలు సహజంగానే విండీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజ్‌కోట్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో, హైదరాబాద్ టెస్టుకు సైతం ఐదు రోజుల కంటే ముందుగానే తెరపడే అవకాశాలున్నాయి. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ డ్రా చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌ని వెస్టిండీస్ తప్పక గెల్చుకోవాలి. ఇది సహజంగానే ఆ జట్టుపై ఒత్తిడిని పెంచుతుంది. వైట్ వాష్ నుంచి తప్పించుకోవడానికి ఆ జట్టు ఎంత వరకూ పోరాడుతుందో చూడాలి. ఏ రకంగా చూసినా బలంగా ఉన్న కోహ్లీ సేన ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాకు వెళ్లి, అక్కడ జరిగే టెస్టుల కోసం సిద్ధమయ్యేందుకు విండీస్‌తో ఇక్కడ ప్రారంభమయ్యే రెండో టెస్టును ప్రాక్టీస్ సెషన్‌గా వినియోగించుకుంటుంది అనడంలో సందేహం లేదు. టీమిండియా 2011లో వెస్టిండీస్‌ను 0-2 తేడాతో చిత్తుచేసింది. కానీ, ఆ వెంటనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి 0-4 తేడాతో ఓటమిని చవిచూసింది. 2013లో జరిగిన రెండు టెస్టులను భారత్ కైవసం చేసుకుంది. ఆ రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా కొనసాగి, మూడు రోజుల్లోనే ముగిశాయి. కానీ, ఆతర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. సిరీస్‌ను ప్రత్యర్థికి సమర్పించుకొని స్వదేశానికి చేరుకుంది. ఇప్పుడు వెస్టిండీస్‌తోనే రెండు టెస్టుల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన భారత జట్టు మరోసారి మూడు రోజుల్లోనే మ్యాచ్‌ని ముగించి, 2-0 తేడాతో సిరీస్‌ను అందుకునే అవకాశం లేకపోలేదు. ఆ వెంటనే ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లాల్సి రావడంతో, గతంలో ఎదురైన అనుభవాలే పునరావృతమవుతాయా అన్న ఆందోళన అభిమానులను వేధిస్తున్నది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ, మొదటి టెస్టులో 230 బంతుల్లోనే 139 పరుగులు సాధించాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన 18 ఏళ్ల యువ సంచలనం పృథ్వీ షా కూడా శతకంతో కదంతొక్కాడు. వీరిద్దరూ రెండో టెస్టులోనూ గొప్పగా రాణిస్తారన్న నమ్మకం అభిమానులకు ఉంది.
రవీంద్ర జడేజా నుంచి మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనను కోరుకుంటున్నారు. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలం వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఏ రకంగా చూసినా, అసాధారణ ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం విండీస్‌కు సాధ్యం కాదన్నది వాస్తవం. టెస్టును గెలిచి, సిరీస్‌ను సమం చేసుకుంటుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. కనీసం డ్రా చేసుకుంటే, వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. కాబట్టి, రెండో టెస్టులో విండీస్ ఆటగాళ్లు విజయం కంటే, ఐదు రోజుల ఆటను చివరి వరకూ కొనసాగించి, డ్రా చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారన్నది నిజం.