క్రీడాభూమి

చర్చిస్తాం.. పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్, ఏప్రిల్ 30: పలు సమస్యలపై ఆటగాళ్లతో చర్చించి, వాటిని పరిష్కరిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్టులోని కొన్ని అంశాలు తమకు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేస్తున్న కొంత మంది వెస్టిండీస్ క్రికెటర్లు జీతభత్యాలను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల భారత్‌తో జరిగిన ప్రపంచ టి-20 చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తర్వాత కెప్టెన్ డారెన్ సమీ మాట్లాడుతూ విండీస్ బోర్డు నుంచి తమకు ఎలాంటి సహాయసహకారాలు అందడం లేదని విమర్శించిన విషయం తెలిసిందే. అసలు టోర్నీలో ఆడతామో లేదో అన్న విషయం కూడా తమకు చివరి క్షణం వరకూ తెలియదని అన్నాడు. మ్యాచ్ ఆరంభమయ్యే ముందు రోజు రాత్రి తమకు టీం జెర్సీలను అందించారని చెప్పాడు. ఇంతటి నిర్లక్ష్య వైఖరి మరెక్కడా కనిపించదని వాపోయాడు. విండీస్ బోర్డు కంటే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచే తమకు మద్దతు లభిస్తున్నదని అన్నాడు. ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రేవో కూడా సమీ వ్యాఖ్యలను సమర్థించాడు. డబ్ల్యుఐసిబి అధ్యక్షుడు డేవిడ్ కామెరాన్‌ను అతను అనుభవం లేని, చాలా పరిమితమైన పరిధిలో ఆలోచించే మూర్ఖుడిగా అభివర్ణించాడు. డబ్ల్యుఐసిబి పాలక మండలిని తక్షణమే రద్దు చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. ముప్పేట దాడి ఎదురుకావడంతో డబ్ల్యుఐసిబి ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆటగాళ్ల సమస్యలపై త్వరలోనే చర్చిస్తామని తెలిపింది. పాలక మండలి రాజీనామా చేయడం లేదా మొత్తం డబ్ల్యుఐసిబినే రద్దు చేయడం వంటి డిమాండ్లకు అర్థం లేదని వ్యాఖ్యానించింది. ఆటగాళ్లు వేతనాలు పెంచాలని కోరుతున్నారని తెలిపింది. దీనితోపాటు మరికొన్ని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయని పేర్కొంది. చర్చల తర్వాత చాలా వరకూ సమస్యలు పరిష్కరమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది. క్రికెటర్ల ప్రయోజనాలు కాపాడడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
బిగ్ బాష్ లీగ్‌లో గేల్ ఆడొచ్చు
మెల్బోర్న్, ఏప్రిల్ 30: బిగ్ బాష్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో వెస్టిండీస్ సూపర్ ఆటగాడు క్రిస్ గేల్ ఆడొచ్చని, అతనిపై నిషేధం విధించే ఆలోచన ఏదీ తమకు లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో ఒక టీవీ ప్రెంజటర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గేల్‌పై సిఎ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఆ సంఘటనకు అప్పుడే ఫుల్‌స్టాప్ పడిందని, గేల్‌ను బిగ్ బాష్‌లో పాల్గొనకుండా అడ్డుకోవడం తమ అభిమతం కాదని సిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ స్పష్టం చేశాడు. గేల్ ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదనే భావిస్తున్నామన్నాడు. అయినప్పటికీ పొరపాటుగా మాట్లాడినందుకు అతనిపై జరిమానా విధించామని గుర్తుచేశాడు. ఆ సంఘటన నేపథ్యంలో గేల్‌పై నిషేధం విధిస్తారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న గేల్ ఇటీవలే తండ్రి అయ్యాడు. అతని జీవిత భాగస్వామి నటాషా ఆడ శిశువును ప్రసవించింది. స్వదేశం వెళ్లిన గేల్ తన కుమార్తెకు ‘బ్లష్’ అని పేరు పెట్టాడు. ఒకటిరెండు రోజుల్లో అతను భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరు జట్టుతో చేరతాడు.