క్రీడాభూమి

హాకీ ఫైవ్స్ ఫైనల్స్‌లో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, అక్టోబర్ 14: భారత పురుషులు, మహిళల హాకీ జట్లు యూత్ ఒలింపిక్స్ ఫైవ్స్ విభాగంలో ఫైనల్స్ చేరి, పతకాలను ఖాయం చేసుకున్నాయి. పురుషుల సెమీ ఫైనల్‌లో భారత్ 3-1 తేడాతో పటిష్టమైన అర్జెంటీనాను చిత్తుచేసింది. స్వదేశంలో మ్యాచ్ కావడంతో, ప్రేక్షకుల నుంచి పూర్తి మద్దతు లభించినా అర్జెంటీనా గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. అందుకు భిన్నంగా భారత్ వ్యూహాత్మకంగా ఆడింది. సందీప్ చిర్మాకో 12, 18 నిమిషాల్లో గోల్స్ చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ కుమార్ ఒక గోల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, మహిళల విభాగంలో భారత్ 3-0 తేడాతో చైనాపై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, విజయభేరి మోగించింది. మ్యాచ్ మొదటి నిమిషంలోనే ముంతాజ్ ఖాన్ గోల్ చేయగా, ఐదో నిమిషంలో రీత్, 13వ నిమిషంలో లాల్‌రెమ్‌సియామీ గోల్స్ సాధించారు. దీనితో 3-0 ఆధిక్యానికి దూసుకెళ్లిన భారత్, ఆతర్వాత రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, అదే తేడాతో మ్యాచ్‌ని ముగించింది.