క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో సైనా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా), ఆగస్టు 30: భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ తన కంటే ఒక స్థానం తక్కువగా ఉన్న వాంగ్ ఇహాన్‌ను ఢీకొని, 16-21, 14-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ తరఫున బరిలోకి దిగిన మిగతా వారంతా ఇంతకు ముందే నిష్క్రమించారు. సైనా ఓటమితో భారత్ పోరాటానికి తెరపడింది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న సైనా పూర్తిగా కోలుకున్నట్టు ప్రకటిస్తున్నప్పటికీ, కీలక మ్యాచ్‌ల్లో రాణించలేకపోతున్నది. కాగా, ప్రపంచ నంబర్ వన్ లీ జురుయ్ మరో సెమీ ఫైనల్‌లో సంగ్ జి హ్యున్‌ను 22-20, 21-11 తేడాతో ఓడించి ఫైనల్‌లో వాంగ్ ఇహాన్‌తో పోరును ఖాయం చేసుకుంది.
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ చెన్ లాంగ్, మూడో ర్యాంక్ ఆటగాడు లీ చాంగ్ వెయ్ ఫైనల్‌లో తలపడనున్నారు. మొదటి సెమీ ఫైనల్‌లో చెన్ లాంగ్ 21-14, 21-16 స్కోరుతో ఐదో సీడ్ తియాన్ హోవెయ్‌పై విజయం సాధించాడు. మరో సెమీస్‌లో మూడో ర్యాంకర్ చాంగ్‌వెయ్ తన కంటే ఒక స్థానం మెరుగైన స్థితిలో ఉన్న లిన్ డాన్‌ను 22-20, 15-21, 21-4 తేడాతో ఓడించాడు.