క్రీడాభూమి

యూత్ ఒలింపిక్స్ రేస్ వాక్‌లో భారత అథ్లెట్ పన్వర్‌కు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనోస్ ఎయిరెస్, అక్టోబర్ 16: యూత్ ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం రాత్రి పురుషుల 5000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ సూరజ్ పన్వర్ రజతం పతకం కైవసం చేసుకున్నాడు. స్టేజీ-2 కాంపిటీషనలో పాల్గొన్న 17 ఏళ్ల పన్వర్ ప్రత్యర్థి, ఈక్వెడార్‌కు చెందిన పాటిన్ ఆస్కార్ కంటే కాస్త వెనుకబడి రజతంతోనే సరిపెట్టుకున్నాడు. ఆస్కార్‌కు గోల్డ్‌మెడల్ లభించగా, ప్యూర్టో రీకోకు చెందిన జాన్ మోరెయూకు కాంస్యం దక్కింది.
బాక్సింగ్‌లో ముగిసిన భారత్ పోరు
యూత్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో భారత పోరు ముగిసింది. ప్రపంచ మాజీ చాంపియన్ జ్యోతి గూలియా (51 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లో ఇటలీకి చెందిన మార్టినా లా పియానా చేతిలో ఓటమి చెందింది. భారత బాక్సర్‌గా పోటీలకు అర్హత సాధించిన హర్యానాకు చెందిన జ్యోతి నిరాశపరిచింది. 2010లో ప్రారంభమైన యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిధ్యం వహించినపుడు శివ థాప, వికాస్ కృష్ణన్ రజత, కాంస్య పతకాలు సాధించారు. ఇప్పటివరకు ఇదే ఉత్తమ ప్రదర్శన.