క్రీడాభూమి

క్రీడాస్ఫూర్తితో నడుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 16: అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణకు సహకరించనందుకు ఐసీసీ తనపై అభియోగాలు మోపినందున ఈ విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని శ్రీలంక క్రికెట్ దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య అన్నాడు. అయితే, తాను తనపై వచ్చిన అభియోగాలపై జరిగే విచారణ సమగ్రంగా, పారదర్శకంగా జరిగేందుకు తన వంతు సహకారం ఉంటుందని, క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశాడు. తనకు ఏ అవినీతి కార్యకలాపాల్లోనూ ప్రమేయం లేదని పేర్కొన్న ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తనపై మోపిన అభియోగాలపై తన వాదన వినిపించేందుకు రెండువారాల గడువుఅవసరమని అన్నాడు. తనపై ఐసీసీ మ్యాచ్ ఫిక్సింగ్, పిచ్ ఫిక్సింగ్ లేదా ఇతర అంశాల్లో అభియోగాలు మోపినందున, దీనిని ఎదుర్కొనేందుకు తాను న్యాయనిపుణుల సలహాలతో ముందుకు సాగుతున్నందున దీనిపై ఎలాంటి విమర్శలు చేయబోనని ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. 49 ఏళ్ల జయసూర్య శ్రీలంక క్రికెట్ బోర్డు చైర్మన్‌గా, పార్లమెంటు సభ్యుడిగా సైతం ఉన్నాడు. శ్రీలంక జట్టుకు వరల్డ్ కప్ అందించడంతోపాటు 110 టెస్టు మ్యాచ్‌లు, 445 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా తాను వ్యవహరిస్తానని మరోసారి స్పష్టం చేశాడు.

చిత్రం.. సనత్ జయసూర్య