క్రీడాభూమి

భారత్‌కు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మస్కట్, అక్టోబర్ 17: భారత పురుషుల హాకీ జట్టు గురువారం ఓమన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక విఫలమైన భారత జట్టు మళ్లీ గాడిలో పడడానికి ఓమన్‌లో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన భారత్ చివరికి మలేసియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొని కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అదే తరహాలో ఆడితే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌కు చేదు అనుభవం తప్పదనే చెప్పాలి. కాగా, కాగితంపై చూస్తే అన్ని విభాగాల్లోనూ ఓమన్ కంటే భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. 2014 ఆసియా క్రీడల్లో ఓమన్‌ను 7-0 తేడాతో చిత్తుచేసిన భారత్ అదే స్థాయిలో విజృంభించి మరో తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుందని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియా క్రీడల తర్వాత జరుగుతున్న మేజర్ టోర్నీ ఇదే కాబట్టి ఇందులో గొప్పగా రాణించడం ద్వారా రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు అన్ని విధాలా సిద్ధం కావాలన్నదే తమ లక్ష్యమని అన్నాడు.