క్రీడాభూమి

సత్తాచాటిన ప్రవీణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, అక్టోబర్ 17: యూత్ ఒలింపిక్స్ పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్ చిత్రవేల్ సత్తాచాటాడు. కాంస్య పతకాన్ని సాధించి అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని నిరూపించాడు. అథ్లెటిక్స్‌లో, ప్రత్యేకించి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్ ప్రదర్శన అంతంతమాత్రమే. అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారీ విఫలం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో 17ఏళ్ల ప్రవీణ్ యూత్ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించడం శుభపరిణామంగా చెప్పుకోవాలి. కొత్తగా ప్రవేశపెట్టిన ఫార్మాట్‌ను అనుసరించి ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ మొత్తం 31.52 మీటర్ల దూరాన్ని లంఘించాడు. ఈ పోటీల్లో క్యూబాకు చెందిన అలెజాండ్రో డియాజ్ (34.18), నైజీరియాకు చెందిన ఇమ్మాన్యుయల్ ఒరిసెమేయివా (33.60) వరుసగా స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. వారి ప్రమాణాలతో పోలిస్తే తమిళనాడుకు చెందిన ప్రవీణ్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లే. అయితే అనేకానేక అడ్డంకులను ఎదుర్కొని అంతర్జాతీయ వేదిక వరకు చేరిన ప్రవీణ్ భవిష్యత్తులో అత్తుత్తమ ప్రమాణాలు నెలకొల్పే అవకాశాలున్నాయి. ఒక ఫామ్‌హౌస్‌లో కూలీగా పనిచేస్తున్న తండ్రి వివిధ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చులను భరిం చే స్థితిలో లేకపోవడంతో ప్రవీణ్ స్వయం కృషితోనే ఈ స్థాయికి చేరుకున్నాడు. చెన్నైలోని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లో చేరిన తర్వాత అతని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర, జాతీయ అథ్లెటిక్స్ సంఘాలు, సమాఖ్యల సహకారం లభిస్తే అతను భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తాడనడంలో సందేహం లేదు.