క్రీడాభూమి

పాక్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూదబీ: కీలకమైన రెండో టెస్టును ఆస్ట్రేలియా చేజార్చుకోవడంతో, సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రాగా ముగియడంతో, రెండో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. హోరాహోరీ తప్పదని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భి న్నంగా మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైన ఆస్ట్రేలియా 373 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 282 పరుగులు సాధించింది. ఫర్హాన్ జమాన్ 94, కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ 94 చొప్పున పరుగులు సాధించగా, నాథన్ లియాన్ 78 పరుగులకు నాలుగు, మార్నస్ లాబుచెంగ్ 45 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 145 పరుగులకే కుప్పకూలింది. ఆరోన్ ఫించ్ (39), మిచెల్ స్టార్క్ (34), మార్నస్ లాబుచెంగ్ (25)తప్ప మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. మహమ్మద్ అబ్బాస్ 33/5, బిలాల్ ఆసిఫ్ 23/3 రాణించి అస్ట్రేలియన్ కుప్పకూల్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో 137 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 400 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఫర్హాన్ ఖాన్ 66, అజర్ అలీ 64 పరుగులు చేశారు. బాబర్ అజీం 99 పరుగుల స్కోరు వద్ద మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో ఎల్‌బీ కావడంతో, ఒక పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. కాగా, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 81 పరుగులు సాధించాడు. నాథన్ లియాన్ 135/4 , మార్నస్ లాబుచెంగ్ 74/2 చొప్పున వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. విజయానికి 538 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. ఆరోన్ ఫించ్ (31), ట్రావిస్ హెడ్ (36), మార్నస్ లాబుచెంగ్ (43), మిచెల్ స్టార్క్ (28) కొద్ది సేపు పోరాటాన్ని కొనసాగించినా ఫలితం లేకపోయింది. మహమ్మద్ అబ్మాస్ 62 పరుగులకు ఐదు, యాసిన్ షా 45 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చి ఆస్ట్రేలియాపై పాకిస్తాన్‌కు రెండో టెస్టుతో పాటు, సిరీస్ అందించారు.