క్రీడాభూమి

డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్ సెమీస్‌కు సైనా, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెనె్స (డెన్మార్క్), అక్టోబర్ 20: భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్స్ తొలిరౌండ్‌లో ఓటమి చెందిన ప్రపంచ 10వ ర్యాంకర్ సైనా మిగిలిన రెండు రౌండ్లరో ప్రత్యర్థి, ప్రపంచ 7వ నెంబర్ ర్యాంకర్, జపాన్‌కు చెందిన నజొమి ఒహుకురాపై ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్ ఖాయం చేసుకుంది. దాదాపు 58 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో సైనా 17-21, 21-16, 21-12 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది. గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌లో సైనా ఇదే ప్రత్యర్థి చేతిలో ఓటమిని చవిచూసింది. గత నెలలో జరిగిన కొరియా ఓపెన్ సహా మరో మూడింట్లో ఒహుకురా చేతిలో సైనా ఓటమిని ఎదుర్కొంది. సైనా, ఒహుకురా ఇద్దరూ ఇప్పవరకు ఏడుసార్లు వివిధ మ్యాచ్‌లలో తలపడగా ఒహుకురా ఏడింట్లో, సైనా నాలుగింట్లో విజయం సాధించారు. కాగా, డెన్మార్క్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 19వ ర్యాంకర్ జార్జియా మర్సికా తుంగ్‌జంగ్‌తో తలపడనుంది. ఇదిలావుండగా, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ భారత్‌కు చెందిన సమీర్‌వర్మను ఓడించి సెమీఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నాడు. ఒక గంట 18 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ప్రపంచ 6వ ర్యాంకర్ శ్రీకాంత్ 23వ ర్యాంకర్ వర్మను 22-20, 19-21, 23-21 తేడాతో ఓడించాడు. శ్రీకాంత్ సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు, రెండో సీడ్ కెంటో మెమోటాతో తలపడనున్నాడు. శ్రీకాంత్-కెంటో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు వివిధ మ్యాచ్‌లలో తలపడతా శ్రీకాంత్ మూడుసార్లు అతనిపై గెలిచాడు. కాగా, మహిళల డబుల్స్‌లో భారత షట్లర్లు అశ్విని పొన్నప్ప-ఎన్.సిక్కిరెడ్డి క్వార్టర్ ఫైనల్స్‌లో నిరాశపరిచారు. యూకీ ఫుకుషిమా-సయాకా హిరోటా చేతిలో ఈ జోడీ ఓటమి చెందింది.