క్రీడాభూమి

మిడిలార్డర్‌పైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, అక్టోబర్ 20: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఘన విజయంతో ఉన్న టీమిండియా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లపై దృష్టి సారించింది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్నా జట్టులో మిడిల్డార్ సమస్య గత ఎంతోకాలం నుంచి వేధిస్తూనే ఉంది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో భారీ ఎత్తున నిర్వహించే వరల్డ్ కప్‌కు ఎనిమిది నెలల కంటే గడువు ఉండడంతో అప్పట్లోగా జట్టులో ప్రధానంగా వేధిస్తున్న మిడిలార్డర్ బ్యాటింగ్‌పై టీమిండియా దృష్టి సారించింది. వరల్డ్ కంటే ముందు భారత్ మరో 18 గేమ్‌లు ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటికల్లా మిడిలార్డర్ సమస్యను పరిష్కరించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ముఖ్యంగా నెంబర్ ఫోర్ బ్యాట్స్‌మన్‌గా ఎవరిని బరిలో దించితే మేలు జరుగుతుందనే దానిపై కోహ్లీసేన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ టూర్ తర్వాత జరిగిన ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ పూర్తి విశ్రాంతి తీసుకున్నప్పటికీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోని జట్టు ఆసియా కప్‌ను ముద్దాడింది. కాగా, ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే వనే్డ సిరీస్‌లో మిడిలార్డర్‌లో యువ బ్యాట్స్‌మన్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన 21 ఏళ్ల రిషబ్ పంత్‌ను నాలుగో బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ టూర్‌లో వనే్డ సిరీస్‌లో చోటుదక్కించుకున్న రిషబ్ పంత్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. ఒవల్‌లో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీ నమోదు చేశాడు. అదే పంథాను కొనసాగించిన ఆయన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో 92 పరుగులు చేశాడు. నాలుగో బ్యాట్స్‌మన్‌గా మరో బ్యాట్స్‌మన్, ఆసియా కప్‌లో 175 పరుగులు సాధించిన అంబటి రాయుడు పేరు కూడా వినిపిస్తోంది. లోయర్ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. స్పిన్నర్ల ద్వయం కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమీతోపాటు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా ఆడలేని పక్షంలో ఉమేష్ యాదవ్‌కు ఛాన్స్ దొరకవచ్చు. అదేవిధంగా రూర్కీ లెఫ్ట్‌ఆర్మ్ పేసర్ ఖలీల్ అహమ్మద్ పేరు కూడా వినిపిస్తోంది. ఆసియా కప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇదిలావుండగా, టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్నా టీమిండియాతో తలపడే ఐదు వనే్డలలో గట్టి పోటీ ఇవ్వడం ద్వారా తమ సత్తా చాటుతామని వెస్టిండీస్ నమ్మకంతో ఉంది. జట్టులో డైనమిక్ ఓపెనర్ ఎవిన్ లెవిస్ వ్యక్తిగత కారణాల వల్ల వనే్డ సిరీస్‌కు దూరం అవుతుండగా, ఇప్పటికే క్రిస్ గేల్, ఆండ్రూ రస్సెల్ వంటి వారు వివిధ కారణాలతో దూరమైన విషయం తెలిసిందే. అయి నా కెప్టెన్ జాసన్ హోల్డర్, వెటరన్ మారియన్ శామ్యూల్స్, పేసర్ కెమర్ రోచ్, ఓపెనర్ చంద్రపాల్ హెమ్‌రాజ్, ఆల్‌రౌండర్ అలెన్, పేసర్ ఒషానే థామస్ వంటి వారితో ప్రత్యర్థికి దీటుగా బదులిస్తామని కోచ్ స్టువర్ లా అభిప్రాయపడుతున్నాడు.