క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతలు చాంగ్‌వెయ్, ఇహాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా), మే 1: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో లీ చాంగ్ వెయ్, మహిళల సింగిల్స్‌లో వాంగ్ ఇహాన్ విజేతలుగా నిలిచారు. ఫైనల్‌లో చాంగ్ వెయ్ 21-17, 15-21, 21-13 స్కోరుతో చెన్ లాంగ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ మొదటి రెండు సెట్లు హోరాహోరీగా సాగినా, చివరిదైన మూడో సెట్‌లో చాంగ్ వెయ్ అసాధారణ ప్రతిభ కనబరిచి, విజయభేరి మోగించాడు. కాగా, సెమీస్‌లో ఓడిన తియాన్ హౌవెయ్, లిన్ డాన్ కాంస్య పతకాలను అందుకున్నారు. మహిళల ఫైనల్‌లో ఇహాన్ 21-14, 13-21, 21-16 ఆధిక్యంతో హాట్ ఫేవరిట్ లీ జురుయ్‌ని ఓడించింది. పురుషుల ఫైనల్‌లో మాదిరిగానే మహిళల ఫైనల్ కూడా మూడు సెట్లు వరకూ జరగడం విశేషం. సెమీస్ పరాజితులు సంగ్ జీ హ్యున్, సైనా నెహ్వాల్ కాంస్య పతకాలను అందుకున్నారు.
ఆసక్తికరంగా సాగిన పురుషుల డబుల్స్‌లో లియూ జన్‌హుయ్, లియూ జూచెన్ జోడీని 21-14, 28-26 తేడాతో ఓడించిన లీ యాంగ్ డయే, యూ ఇయాన్ సియాంగ్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. సెమీస్‌లో ఓడిన తకెషి కమురా/ కియో సొనొదా, ఫుహైఫెంగ్/ జాంగ్ నాన్ జోడీలు కాంస్య పతకాన్ని సంపాదించుకున్నారు.
మహిళల డబుల్స్ టైటిల్‌ను మిసాకీ మత్సుమొతో, అయాకా తకహషి జోడీ గెల్చుకుంది. ఫైనల్‌లో వీరు నవోకో ఫకూమా, కురుమీ యనావో జోడీపై 21-13, 21-15 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేశారు. సెమీస్‌లో ఓడిన చాంగ్ యెనా/ లీ సో హీ, నిత్య క్రిషింద మహేశ్వరి/ గ్రేసియా పోలీ జోడీలకు కాంస్య పతకాలు లభించాయి.
మిక్స్‌డ్ డబుల్స్‌లో చాంగ్ నన్, జావో యున్‌లెయ్ జోడీకి టైటిల్ లభించింది. వీరు ఫైనల్‌లో 16-21, 21-9, 21-17 తేడాతో తొనోవీ అహ్మద్, లిలియా నాట్సిన్ జోడీపై గెలుపొందారు. సెమీస్‌లో ఓడిన కోసంగ్ హ్యున్/ కిమ్ హనా, షిన్ బియెక్ చియోయ్/ చయే యూ జంగ్ జోడీలకు కాంస్య పతకాలు దక్కాయి.